Home ghmc

Tag: ghmc

Post
తెలంగాణలో కొత్తగా 2 వేల కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 2 వేల కరోనా కేసులు

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా రోజువారీ కేసులు 2 వేలు దాటాయి. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం సాయంత్రం 8 గంటల వరకు కొత్తగా 2055 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 303 మంది బాధితులు మహమ్మారి బారినుంచి కోలుకున్నారు. మరో ఏడుగురు మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా కేసులు 3,18,704కు చేరాయి. ఇందులో 1741 మంది మరణించగా, 3.03 లక్షల మంది బాధితులు కోలుకున్నారు. రోజువారీ కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్‌ కేసులు కూడా అధికమవుతున్నాయి....

Post
తెలంగాణ లో కొత్తగా 1,914 కరోనా కేసులు నమోదు

తెలంగాణ లో కొత్తగా 1,914 కరోనా కేసులు నమోదు

హైదరాబాద్‌: రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు 2 వేలకు చేరవలో నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,914 పాజిటివ్‌ కేసులు నమోదవగా, మరో ఐదుగురు మరణించారు. మహమ్మారి బారినుంచి 285 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,16,649కి చేరాయి. ఇందులో 1734 మంది కరోనాతో మృతిచెందారు. మరో 3.03 లక్షల మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల్లో 11,617 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 6634 మంది హోం...

Post
ఫిబ్రవరి 11న జీహెచ్‌ఎంసీ నూతన మేయర్‌ ఎన్నిక

ఫిబ్రవరి 11న జీహెచ్‌ఎంసీ నూతన మేయర్‌ ఎన్నిక

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌తో పాటు దీనికి సంబంధించిన విధానపరమైన సూచనలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ రోజు విడుదల చేసింది. ప్రత్యేక సమావేశ౦ నిర్వహించేందుకు ప్రిసైడింగ్ అధికారిని నియమించనున్నారు.ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 11.00 గంటలకు నూతనంగా ఎన్నికైన జీహెచ్ఎంసీ వార్డు మెంబర్లతో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక సమావేశంలో మేయర్ ఎన్నిక ఉంటుంది. తర్వాత డిప్యూటీ ఎన్నిక...

Post
తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇండ్ల ఘనత కేసీఆర్ గారిదే:మంత్రి కేటీఆర్

తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇండ్ల ఘనత కేసీఆర్ గారిదే:మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్,తీస్మార్ న్యూస్:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే అని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. హైదరాబాద్ న‌గ‌రంలోని వ‌న‌స్థ‌లిపురం ప‌రిధిలోని జైభ‌వాని న‌గ‌ర్‌లోని రైతుబజార్ వ‌ద్ద‌ నిర్మించిన 324 డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను మంత్రి కేటీఆర్ బుధ‌వారం ఉద‌యం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేటీఆర్ ప్ర‌సంగించారు. పేదోడు ఆత్మ‌గౌర‌వంతో బ‌త‌కాల‌న్న‌దే సీఎం కేసీఆర్ ఉద్దేశమ‌ని స్ప‌ష్టం చేశారు....

Post
జనవరిలో మోగనున్న నగరపాలక ఎన్నికల నగారా…

జనవరిలో మోగనున్న నగరపాలక ఎన్నికల నగారా…

2021 జనవరి నెలాఖరులో మహనగరపాలకమండలి ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది.గ్రేటర్ కార్పోరేషన్ ఎన్నికలు జనవరి నెలాఖరులో లేదా ఫిబ్రవరి మొదటివారంలో నిర్వహించాలనే యోచనలో ఉంది.ఈ మేరకు తాజా ప్రతిపాదికను రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకు తీసుకెళ్లేందుకు నిర్ణయించుకున్నట్తు తెలుస్తుంది. ఇప్పటికే అధికారులు ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు, ఇప్పటికే ఓటర్ల తుది జాబితా షెడ్యూల్ కూడా విడుదల చేశారు.ఓటర్ల జాబితా విడుదల చేసిన తరువాత ఎప్పుడైనా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం...