అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. రాజధాని భూముల విషయంలో సీఐడీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు గురువారం ఏపీ హైకోర్టులో ఆయన తరఫున న్యాయవాదులు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ రాజధాని అమరావతిలో జరిగిన భూ...