హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. ఇప్పటికే 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మరికొందరు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. టీఆర్‌ఎస్ నుంచి నోముల భగత్‌కుమార్, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, బీజేపీ నుంచి పానుగోతు రవికుమార్ నామపత్రాలు దాఖలు చేయనున్నారు. నామినేషన్ల దాఖలు చేసేందుకు నేడు చివరి అవకాశమని అధికారులు తెలిపారు. రేపటి నుంచి నామినేషన్ల పరిశీలించనుండగా.. ఏప్రిల్ మూడో తేదీ...
Tag: bjp
హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నిలిపివేత
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది.రెండో ప్రాధాన్యతఓట్ల లెక్కింపులో తలెత్తిన గందరగోళంతో సిబ్బంది కౌంటింగ్ నిలిపివేశారు. 8 మంది అభ్యర్థుల ఎలిమినేషన్‌లో 50 ఓట్లు గల్లంతైనట్లు సిబ్బంది తెలిపారు. ఓట్ల గల్లంతుపై భాజపా-కాంగ్రెస్ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆర్వోకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్‌లో తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు పూర్తి..
హైదరాబాద్ : మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఏడు రౌండ్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఆధిక్యంలో ఉన్నారు. సమీప రామచందర్‌రావుపై 8,021 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏడు రౌండ్లలో కలిపి టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణీదేవికి 1,12,689 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకు 1,04,668 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావుకు 53,610 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 31,554 ఓట్లు, టీడీపీ అభ్యర్థి ఎల్ రమణకు...
‘హైదరాబాద్’లో ఆరు రౌండ్లు పూర్తి.. ఆధిక్యంలోనే టీఆర్‌ఎస్
హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు ఆరు రౌండ్లు పూర్తయ్యాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి 7,626 ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆరు రౌండ్లలో టీఆర్‌ఎస్‌కు 1,05,710 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకు 98,084 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 50,450 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 29,627, టీడీపీ అభ్యర్థి ఎల్. రమణకు 5,606 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఆరు రౌండ్లలో కలిపి...
ట్రెండింగ్‌లో చీటర్ అరవింద్ హ్యాష్‌ట్యాగ్
హైదరాబాద్: ‘తెలంగాణలో పసుపు బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదనేదీ లేదు. నిజామాబాద్‌లో సుగంధద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయాన్ని ఇప్పటికే ఏర్పాటు చేశాం’ అంటూ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ రాజ్యసభలో లిఖిత పూర్వకంగా చేసిన ప్రకటనపై పసుపు రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఏడాదిన్నరగా రైతులతో బీజేపీ దాగుడుమూతలు ఆడుతూ తీరా బోర్డు పెట్టే ఆలోచనే లేదని స్పష్టం చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని ఎంపీ అరవింద్ రైతులకు బాండ్...
ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లిన ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ వస్తేనే విజయం
ప్రాధాన్యతా నంబరే ప్రధానం! సాధారణ ఎన్నికలకు పూర్తి భిన్నం ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రాధాన్యక్రమంలో అభ్యర్థులందరికీ ఓటువేసే అవకాశం చెల్లిన ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ వస్తేనే విజయం ఏ ఎన్నికల్లోనూ ఫలితం 1తో తేలలేదు.. 2 దాటలేదు సాధారణ ఎన్నికల పోలింగ్‌కు పూర్తి భిన్నం ఎమ్మెల్సీ ఓటింగ్. సాధారణ ఎన్నికల బరిలో నిలిచినవారిలో ఒక్కరికి మాత్రమే ఓటేస్తాం. కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో ఎంతమందికైనా ఓటువేసే అవకాశం ఉంటుంది. ఓటర్లు ఇచ్చే ప్రాధాన్యతా నంబరే...
బండి సంజయ్ పై మండిపడ్ద మంత్రి సత్యవతి రాథోడ్
ములుగు : దేవతల దగ్గరికి వచ్చి ఏమి కోరుకోవాలో కూడా కనీసం తెలియని మూర్ఖుడు బీజేపీ నేత బండి సంజయ్ అని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగు జిల్లాకు వచ్చి గట్టమ్మ దేవతను మొక్కి సీఎం కేసీఆర్ నాశనం కావాలని కోరుకున్నట్లు చెప్పడం కంటే బుద్ధిహీనత మరొకటి లేదన్నారు. ఏవరైనా దేవతల కాడికి వచ్చి అందరిని సల్లంగా చూడు తల్లి అని మొక్కుకుంటారు. కానీ ఇలా మొక్కుకోవడం అంటే అది బండి...
మా సహనాన్ని పరీక్షించొద్దు…బీజేపీ పై కేటీఆర్ ఫైర్
ఈరోజు మా పార్టీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటి పైన బిజెపి శ్రేణులు చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు ఏ మాత్రం చోటు లేదు. ప్రజాస్వామ్యంలో తమ వాదనతో ప్రజలను ఒప్పించడం చేతకాక, ఇతర పార్టీలపైన భౌతిక దాడులు చేస్తూ తమ వాదన వినిపించాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ తీరుని ప్రజాస్వామ్యవాదులు అంతా ఖండించాల్సిన అవసరం ఉన్నది. గతంలోనూ బీజేపీ భౌతిక దాడులకు ప్రయత్నించింది. రాజకీయాల్లో హేతుబద్ధమైన విమర్శలను దాటి, భౌతిక...
రైతుల్ని రెచ్చగొట్టి,ఎర్రకోటపై దాడి చేసింది ఇతనేనా?
న్యూఢిల్లీ : చారిత్రక ఎర్రకోటపై నిత్యం జాతీయ జెండా రెపరెపలాడే చోట మంగళవారం సిక్కు మత జెండా ఎగిరింది. స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రధాని జాతీయ జెండా ఎగురవేసే బురుజుపై కొందరు యువకులు కాషాయ వర్ణంలో ఉండే సిక్కు పతాకాన్ని ఎగురవేశారు. ఆ హింస వెనుక ఎవరున్నారు? అనే అంశంపై పలువురిలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సోమవారం రాత్రి ఏం జరిగింది? సోమవారం సాయంత్రం నుంచి ట్రాక్టర్ పరేడ్ గురంచి యునైటెడ్ కిసాన్ మోర్చా ప్రతినిధులు, ఢిల్లీ పోలీసులకు...
సీఎం పవన్ కళ్యాణ్
తిరుపతిలో జనసేన మీటింగ్ పెట్టుకుంటే.. లోక్ సభ ఉప ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారని అనుకున్నారంతా. తీరా ఆ మీటింగ్ లో డిమాండ్లు వింటే.. పవన్ కల్యాణ్, “సీఎం..సీఎం” అనే మాటల్ని ఎంతలా తలకెక్కించుకున్నారో అర్థమవుతుంది.తిరుపతి లోక్ సభ సీటు పరిధిలో జనసేన బలం బాగానే ఉందని అన్నారు ఆ పార్టీ నేతలు, అంతవరకు బాగానే ఉంది. అంత బలమైన సీటుని ఒకవేళ బీజేపీకి త్యాగం చేయాల్సి వస్తే కచ్చితంగా బీజేపీ-జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్...