మాజీ క్రికెటర్‌ ఆత్మహత్య

బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్‌ ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రాబోయే బంగాబందు టీ-20 టోర్నమెంట్‌లో చోటు దక్కకపోవడంతో నిరాశ చెంది బంగ్లాదేశ్ అండర్ -19 మాజీ ఆటగాడు మహమ్మద్ సోజిబ్(21) శనివారం రాజ్‌షాహిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. టోర్నమెంట్‌లో తనకు అవకాశం కచ్చితంగా లభిస్తుందని తన చుట్టూ ఉన్న వ్యక్తులతో సోజిబ్‌ తెలిపాడు.

టీ-20 ఆటగాళ్ల జాబితాలో తన పేరు రాలేదని నిరాశకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని అతడి తల్లిదండ్రులు తెలిపారు. మహమ్మద్ సోజిబ్ మృతిని దుర్గాపూర్ పోలీస్ స్టేషన్ అధికారి హష్మోత్ అలీ ధ్రువీకరించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం సోజిబ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2017లో అండర్ -19 ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ తాత్కాలిక జట్టులో సోజిబ్ పాల్గొన్నాడు. అతడు 2018 అండర్ -19 ప్రపంచ కప్‌లో స్టాండ్-బై ప్లేయర్ గా ఉన్నాడు.