- అవును … మార్పు కావాలి రావాలి అని అనుకుందాం…కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానికి ఆ అవసరం లేదు ఇంకో 20 ఏళ్ల వరకు రాదు
- ఈరోజు ప్రజల నాడిని ఎప్పటికప్పుడు పసిగట్టి అనేక పథకాలను ప్రవేశపెట్టి దేశం గర్వించే స్థాయిలో ఎన్నో నూతన సంస్కరణలకు ఆజ్యంపోస్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
- ప్రాజెక్టులు నిర్మించాలి అంటే కనీసం రెండు దశాబ్దాల సమయం పట్టే దేశంలో కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తెచ్చారు
- ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం గురించి మాట్లాడుకుందాం…2014 కి ముందు హైదరాబాద్ లోని పరిశ్రమలకు పవర్ హాలిడేస్ ఇచ్చేవారు…ఎందుకు…!!
- నాటి పాలకులు రాజధాని నగరానికి మరియు రాష్ట్రంలో ని ఇతర ప్రాంతాలకు కరెంట్ ఎలా సరఫరా చెయ్యాలో ఉత్పత్తి ని ఎలా పెంచాలో అంచనా వేయడంలో విఫలం అయ్యారు…దీంతో హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయ కంపెనీలు పెద్దగా సుముఖత వ్యక్తం చేసేవి కాదు…పైగా హైదరాబాద్ నుండి గుజరాత్ మరియు ఇతర రాష్ట్రాలకు తరలిపోయిన కంపెనీలు ఎన్నో…!!
- విద్యుత్ సమస్యలను అధికమిస్తే రాష్ట్రంలోని అనేక సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆలోచించారు కేసీఆర్ గారు తాను ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన వెంటనే ఇతర రాష్ట్రాల నుండి విద్యుత్ కొనుగోలు చేసి ఆ తరువాత తెలంగాణ రాష్ట్రంలో నూతన గ్రిడ్ లను నిర్మించి విద్యుత్ ఉత్పత్తిని రికార్డు స్థాయిలో పెంచడమే కాకుండా ఇతర రాష్ట్రాలకు అమ్మే స్థాయికి తీసుకొని వచ్చారు హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెరిగేలా చేశారు
ఇక హైదరాబాద్ నగర శాంతి భద్రతల గురించి మాట్లాడుకుందాం
- మనలో మన మాట చంద్రబాబు నాయుడు హయాంలో హైదరాబాద్ నగరం ధర్నాలు, సామాన్యుల మీద పోలీసుల లాఠీ ఛార్జీలతో నగరం అట్టుడికి పోయింది…పైగా నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేంద్రంలో ని బీజేపి ప్రభుత్వంలో భాగం
- ఆ తరువాత కాంగ్రేస్ హయాంలో అయితే హైదరాబాద్ నగరం వరుస బాంబ్ బ్లాస్టులతో అట్టుడికి పోయింది…ఒకానొక సమయంలో హైదరాబాద్ నగరం యొక్క బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా మసక బారింది
- 2014 లో నవ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నేతృత్వంలోని తొలి ప్రభుత్వం హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ గ్రాఫ్ ని ఎవరు ఊహించని రీతిలో పెంచింది…పారిశ్రామికంగా ఎన్నో రాయితీలు ఇస్తూ స్థానికంగా ఉద్యోగ అవకాశాలను పెంచింది…ఇక నగర ప్రజల కోసం దేశంలో ఏ ఇతర నగరాలలో లేని విధంగా 5 లక్షల సిసి కేమెరా లను అమర్చి శాంతి భద్రతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది
- ప్రతి పౌరునికి కావాల్సింది స్వేచ్ఛ, భద్రత మరియు జనరంజక పథకాలు ఈ మూడు #కేసీఆర్ గారి ప్రభుత్వం ఇస్తున్నప్పుడు వేరే పార్టీల అవసరం దేనికి అనేది హైదరాబాద్ నగర ప్రజల ప్రస్తుత వాదన…పైగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని విద్వేషపూరిత మాటలు కూడా నగర ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నది…కోరి కోరి ప్రజలు తమ నెత్తిన కొరివిని పెట్టుకోలేమని అని చెప్పకనే చెప్తున్నారు
– రఘువీర్ రాథోడ్