టీపీసీసీ చీఫ్ పదవిని కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయబోతున్న వేళ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పీసీసీ అధ్యక్ష పదవి కంటే క్యాంపెయిన్ కమిటీ (ప్రచార కమిటీ) చైర్మన్ పదవి సరిగ్గా నప్పుతుందన్నారు. నా వర్కింగ్ స్టయిల్‌కి నా ప్రవృత్తికి, నా మెంటాలిటీకి అది సూటబుల్ జాబ్ అన్నారు. నీకు పీసీసీ చీఫ్ కావాలా.? క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ కావాలా? మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కావాలా.? కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ కావాలా.? అని అధిష్టానం అడిగితే, నేను క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ పదవినే కోరుకుంటానన్నారు. నా ఎనర్జీ దానికి సూట్ అవుతుందన్నారు, ఓ న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన రేవంత్, ‘పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి, రోజూ గంటల కొద్దీ పార్టీ నేతలతో సమావేశమై సమస్యలను ఎదుర్కొనే బదులు, పాదయాత్ర చేయడమో ప్రజల దగ్గరకు వెళ్లడమో, ప్రభుత్వంపై కోట్లాడటమో నాకు ఎక్కువ సౌలభ్యంగా ఉంటుంద’ని వ్యాఖ్యానించారు.ఒకవేళ పీసీసీ బాధ్యతలను ఎవరికైనా కట్టబెట్టి, తనకు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చినా సంతోషమేనని రేవంత్ తెలిపారు. సమస్యలపై పోరాటం చేయడం ప్రజల్లోకి వెళ్లడం, ప్రభుత్వాల తీరును ఎండగట్టడం. ప్రజల్లో మమేకమై ప్రచారం చేయాలంటే క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ బాధ్యతే కీలకమన్నారు. పీసీసీ అనేది పార్టీలోని నాయకులను సమన్వయం చేసుకోవడానికి పని చేస్తుందన్నారు. టీడీపీలో నాకున్న పదవులన్నీ వదులుకొని బేషరతుగా కాంగ్రెస్ పార్టీలో చేరాను: ఆ రోజు కూడా నేను క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ పదవినే అడిగాను. వర్కింగ్ ప్రెసిడెంట్ వద్దన్నాను. కానీ పార్టీ నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించారని రేవంత్ తెలిపారు. ప్రధాని కాకముందు మోదీ సైతం క్యాంపెయిన్ కమిటీ చైర్మన్‌గా పని చేశారు. ఆయన నాకు స్ఫూర్తి కాదు నా పాజిటివ్ ఎనర్జీతో కార్యకర్తలకు సేవ చేయగలనో అదే చేద్దామని అనుకుంటున్నా. ఏ పదవి ఇవ్వకున్నా కాంగ్రెస్ జెండా మోద్దామని అనుకుంటున్నా’’ని రేవంత్ రెడ్డి తెలిపారు.
