తమిళనాడు నూతన ముఖ్యమంత్రి

తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ విజయ దుందుభి మోగిస్తుందని, స్టాలిన్‌ నాయకత్వంలో తమిళనాడు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో తమిళనాడు రాష్ట్రానికి స్టాలిన్‌ శాశ్వత ముఖ్యమంత్రిగా పనిచేస్తారని కేతిరెడ్డి తెలిపారు. జయలలిత మరణం వెనుక ఉన్న నిజాలను స్టాలిన్‌ నిగ్గుతేల్చుతారని కేతిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో స్టాలిన్‌ తను అధికారంలోకి వస్తే జయలలిత మరణంపై సమగ్ర దర్యాప్తు జరిగేలా చూస్తానని తెలిపిన మాటలను కేతిరెడ్డి గుర్తుచేశారు. అదే చేస్తే కరుణానిధి వారసత్వంతో పాటు, జయలలిత రాజకీయ వారసత్వంను కూడా స్టాలిన్ సొంతం చేసుకోవటం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు.

గత 5 సంవత్సరాలుగా నాయకత్వ లేమితో తమిళనాడు అన్ని రంగాల్లో వెనుకంజ వేసిందని కేతిరెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుంచడం కోసం స్టాలిన్‌ అడుగులు వేస్తారని పేర్కొన్నారు. గతంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన స్టాలిన్‌ ముఖ్యమంత్రి పదవికి కూడా న్యాయం చేస్తారన్నారు. చెన్నై మేయర్ గా ఉన్న రోజుల్లో నగరంలో ట్రాఫిక్ సమస్యలను తీర్చడానికి ఎన్నో బ్రిడ్జ్ లు నిర్మించడం వారి పరిపాలన దక్షతకు నిదర్శనమని కేతిరెడ్డి తెలిపారు. డీ.ఎం.కే. యువ నాయకుడుగా ఆయన పార్టీ కి చేసిన సేవలు చాలా గొప్పయని వారి తండ్రి గతం లో కితాబు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. స్టాలిన్ విజయంతో భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో సమూలమార్పు రావటం తథ్యమని కేతిరెడ్డి పేర్కొన్నారు.