వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక సాయం పంపిణీ రెండో దశను ప్రారంభించిన పద్మారావు గౌడ్

సికింద్రాబాద్, నవంబర్ 06 : వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఆర్ధిక సాయం పంపిణీ రెండో దశను సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో గౌరవ ఉప సభాపతి శ్రీ తీగల్ల పద్మారావు గౌడ్ గారు శుక్రవారం ప్రారంభించారు. చిలకలగూడ లోని బడీ మస్జిద్, ఈద్గా, ఎరుకల బస్తి, నేషనల్ హోటల్ తదితర ప్రాంతాల్లో శ్రీ పద్మారావు గౌడ్ అధికారులు, నేతలతో కలిసి ఇంటిటికీ తిరుగుతూ నగదును పంపిణీ చేశారు. GHMC ఉప కమీషనర్ శ్రీ మోహన్ రెడ్డి నేతృత్వంలో 16 అధికారుల బృందాలు శుక్రవారం ఈ పంపిణీ ప్రక్రియలో పాల్గొన్నాయి. చిలకలగూడ తో పాటు బౌద్దనగర్ లోని అంబార నగర్, సంజయ్ గాంధీ నగర్, ఏకశిలా మెడికల్, తార్నాక లోని ఓ యు క్యాంపు, అడ్డగుట్ట డివిజన్ లోని నార్త్ లాలాగూడ ప్రాంతాల్లో వరద బాధితులకు నిధుల పంపిణీ ప్రక్రియ కొనసాగింది. కార్పరేటర్లు కుమారి సామల హేమ, శ్రీమతి ధనంజన బాయి గౌడ్, శ్రీమతి అలకుంట సరస్వతి, శ్రీమతి విజయ కుమారి, తెరాస యువ నేతలు కిశోరే కుమార్ గౌడ్, రామేశ్వర్ గౌడ్ లతో పాటు అధికారులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ గారు మాట్లాడుతూ 110 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా జంట నగరాల్లో కురిసిన వర్షాలకు ప్రజా జీవనం ఇబ్బందులకు గురైందని, వెంటనే తాము అదుకున్నామని స్పష్టం చేశారు. ప్రతి బాధితుని ఇంటికి అధికారులు చేరుకొని సాయం అందిస్తారని, ప్రజలు సహకరించాలని అయన విజ్ఞప్తి చేశారు. విపత్కర పరిస్తితుల్లో తమ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలో భారి వర్షాలు కురిసినప్పటికీ ఇబ్బందులు తలెత్తకుండా గడచిన ఐదేళ్ళ కాలంలో తాము చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు అందించాయని శ్రీ పద్మారావు గౌడ్ తెలిపారు. వరద సాయం డబ్బులు పొందేందుకు లంచాలు చెల్లించ రాదని సూచించారు.
Issued by Camp Office of Hon’ble Deputy Speaker Sri Padmarao Goud Garu @ Secunderabad on 06.11.2020.
Hon’ble Deputy Speaker Sri Padmarao Rao stated that government is looking after well being of deprived sections of the society with focus on minority communities. He launched second phase of payment of flood relief to a tune of rupees 10 thousands to each of the families in Secunderabad Constitutency. While disbursing money to victims at chilkalguda, badi masjid localities, sri Padmarao Goud stated that he has taken all precautions to ensure that victims are reached by the official machinery properly. On Friday he alongwith officials, corporators and leaders intensively toured various places of Lalaguda Masjid, OU Campus, Boudhangar and Sitaphalmandi area. Youth Leaders Sri Kishore Kumar, Sri Rameshwar Goud and others also participated in the programme.