రాజకీయ పార్టీని ప్రారంభించనున్న సూపర్‌ స్టార్‌

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తాను అతి త్వరలో ఓ రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకి సరిగ్గా 6 నెలల ముందు రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ట్విట్టర్‌ వేదికగా గత గురువారం ప్రకటించారు. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్‌ పనులు కూడా శరావేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు రజనీ రాజకీయ రంగప్రవేశంపై స్పందించారు. ‘‘ రజనీకాంత్‌ పార్టీ ఇంకా రిజిస్ట్రర్‌ కాలేదు. పార్టీ విధివిధానాలు, సిద్ధాంతాలు ఏంటో తెలియదు.

అసలు వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాడో లేక పొత్తు పెట్టుకుంటాడో స్పష్టత లేదు. అతడు ఏం చేయబోతున్నాడో కూడా తెలియదు. దీనిపై స్పష్టత వస్తేనే రజనీ ప్రభావం తమిళనాడు రాజకీయాలపై ఎంత ఉంటుందో చెప్పగలం. చాలా మంది బీజేపీ నేతలు ఆయనతో టచ్‌లో ఉన్నారు. రజనీ బీజేపీతో కలుస్తాడో లేదో ఏం చేస్తాడో చూడాలి’’ అని అన్నారు.