కేసీఆర్ పై ప్రశంసల వర్షం.....

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ తో అన్ని రాజకీయ పార్టీలు ఈసారి రెట్టింపు జోరు కనబర్చి విజయ పథకాన్ని ఎగరేయాలని భావిస్తున్నాయి. అయితే గత ఆరేళ్లలో హైదరాబాద్ నగరం అభివృద్ధిక తెరాస ప్రభుత్వం పెద్ద పీట వేసింది అని, పెట్టుబడులకు ముఖద్వారం గా నిలిపింది అని ఆ పార్టీ కి చెందిన కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అయితే ఈ అభివృద్ధిన ఇలానే కొనసాగించాలంటే రాబోయే GHMC ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ ను గెలిపించాలని నగర వాసులను కోరారు. అయితే ఆరేళ్ల కిందటి హైదరాబాద్ తో పోల్చితే ప్రస్తుతం మనం చూస్తున్న భాగ్యనగరం లో ఎంతో పురోగతి ఉంది అంటూ సీఎం కేసీఆర్ పాలన ను కవిత కొనియాడారు.

హైదరాబాద్ నగరం లో అద్భుతమైన రహదారులు, ఫ్లై ఓవర్లు, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించే విధంగా పరిస్థితులు, 24 గంటల కరెంట్ మరియు శాంతి భద్రతలు ఉన్నాయి అంటే అందుకు కారణం సీఎం కేసీఆర్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే భవిష్యత్ లో కూడా ఇదే తరహా అభివృద్ది కొనసాగాలి అని ఆకాంక్షించారు. అయితే ఆ బాధ్యత మాత్రం గ్రేటర్ ప్రజల చేతిలోనే ఉంది అని తెలిపారు.గొప్ప ర్యాంకులు, గొప్ప పరిస్థితులు మాటలతో రావు అని, ఉత్తమ పాలన తో పాటుగా ఎంతో కష్టపడితేనే సాధ్యం అవుతాయి అని పేర్కొన్నారు.a