Hyd:పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యం..
గౌరవ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి సూచనల మేరకు రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు కార్యక్రమం ఈరోజు చివరి తేదీ కావడంతో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ వార్డుకు చెందిన కార్పొరేటర్ మన్నెం విజయలక్ష్మి సుబ్బారావు గారు (490), 9వ వార్డు కార్పొరేటర్ రజిత రవికాంత్ గారు (669), కో-ఆప్షన్ మెంబర్ జ్యోతి సతీష్ గారు (220), మాజీ వార్డు సభ్యుడు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో (70 ) పట్టభద్రుల ఓటరు నమోదు పత్రాలను నిజాంపేట్ మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, పట్టభద్రులు మాత్రమే ఎన్నుకునే విలువైన ఎన్నికలు కాబట్టి ప్రతి పట్టభద్రుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈరోజు చివరి తేదీ కావడంతో పట్టభద్రులందరూ తప్పని సరిగా ఓటు నమోదు చేసుకోవాలని కోరారు.