అభివృద్ధి కోసం కారు గుర్తుకే ఓటు వేయండి..  ఎమ్మెల్సీ నవీన్ రావు

టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు ప్రతి ఒక్కరు సైనికుడిలాగా పనిచేసి,కారు గుర్తుకు ఓటు వేసి మాదాపూర్ డివిజన్ టిఆర్ఎస్ అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఇంచార్జి ఎమ్మెల్సీ శ్రీ.నవీన్ రావు గారు మరియు మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు శ్రీ.ఎరగుడ్ల శ్రీనివాస్ యాదవ్ గారు.. జి.హెచ్.ఎం.సి ఎన్నికల ప్రచారంలో భాగంగా మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజత్ నగర్ వికర్ సెక్షన్ బస్తీలో టిఆర్ఎస్ అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు..ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు,ఉపాధ్యక్షులు,నాయకులు,కార్యకర్తలు,మహిళలు,యువకులు తదితరులు పాల్గొన్నారు..