జోరుగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల నామినేషన్లు

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు ఖరారు కావడంతో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్‌ఎస్‌ బంజారాహిల్స్ అభ్యర్థి గద్వాల్ విజయలక్ష్మి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులతో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. వెంకటేశ్వర కాలనీ అభ్యర్థి మన్నే కవితా గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్, విప్లవ్ కుమార్,

ఎమ్మెల్యే దానం నాగేందర్ లతో కలిసి వెళ్ళి నామినేషన్ వేసేందుకు ర్యాలీగా తరలి వెళ్లారు. అలాగే జూబ్లిహిల్స్ కార్పొరేటర్ అభ్యర్థి కాజా సూర్యనారాయణ , ఇంచార్జి చంద్రశేఖర్ రెడ్డి, దానం నాగేందర్ తో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.