జీడిమెట్ల టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలిపి ఏకగ్రీవ తీర్మానం చేసిన కాలని వాసులు .

ప్రజల ఆశీర్వాదం టీఆర్ఎస్ పార్టీకే..

కుత్బుల్లాపూర్,తీస్మార్ న్యూస్: 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని పేట్ బషీరాబాద్ లో గల ఓల్డ్ శివాలయం వద్ద డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన కూన పద్మ ప్రతాప్ గౌడ్ గారికి మద్దతు తెలుపుతూ డిసెంబర్ 1న జరిగే ఎన్నికల్లో కారు గుర్తు పై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామని కాలని వాసులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అభివృద్ధే అజెండాగా గత ఆరేండ్లలో ప్రభుత్వ పని తీరుని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని అన్నారు. ఏ ప్రాంతానికి వెళ్లినా టీఆర్ఎస్ కు ప్రజల సంపూర్ణ మద్దతు లభిస్తుందని, జరగబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో గ్రేటర్ పై మరోసారి గులాబి జెండా ఎగరడం ఖాయమని అని అన్నారు. ప్రజలందరూ తమ ఓటు హక్కుని వినియోగించుకొని టీఆర్ఎస్ అభ్యర్థుల మెజారిటీ గెలుపుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జీఎస్వి దీక్షిత్, అనిరుధ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.