నేటి నుండి కే.టీ.ఆర్ రోడ్ షో

నేటి నుంచి గ్రేటర్‌లో కేటీఆర్‌ ఎన్నికల ప్రచారం

హైదరాబాద్:‌  నేటి నుంచి జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారాన్ని   టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు.    కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి నేడు కేటీఆర్‌ రోడ్‌ షో మొదలవనుంది.  కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో 4 చోట్ల నిర్వహించనున్న రోడ్‌షోల్లో కేటీఆర్‌ పాల్గొననున్నారు. ఈనెల 28న ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఉండనుంది.

కేటీఆర్‌ ఎన్నికల ప్రచారం షెడ్యూల్:

  • సాయంత్రం 5 గంటలకు ఓల్డ్‌ అల్లాపూర్‌ చౌరస్తాలో రోడ్‌షో
  • సాయంత్రం 6గంటలకు మూసాపేట్‌ చిత్తారమ్మ తల్లి చౌరస్తాలో రోడ్‌షో
  • రాత్రి 7 గంటలకు కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం ఐడీపీఎల్‌ చౌరస్తా
  • రాత్రి 8 గంటలకు సాగర్‌ హోటల్‌ జంక్షన్‌లో