ప్రతిపక్షాలకు ఎన్నికలప్పుడే ప్రజలు యాదికొస్తరా..?
  • రూ.10వేలు ఆపినవాళ్లు.. రూ.25వేలు ఇస్తారా..?
  • తెలంగాణలో పక్కా లోకల్‌ పార్టీ టీఆర్‌ఎస్‌’..
  • బీజేపీ బోగస్‌మాటలు ప్రజలు నమ్మరు..
  • కుత్బుల్లాపూర్ రోడ్ షో లో మంత్రి కేటీఆర్..

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చింతల్, షాపూర్ నగర్ లలో టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన 8 మంది కార్పొరేటర్ అభ్యర్థులతో కలిసి ‘రోడ్ షో‘ నిర్వహించారు. కుత్బుల్లాపూర్ లో ప్రచారానికి విచ్చేసిన గౌరవ మంత్రి కేటీఆర్ గారికి ఆడపడుచులు బతుకమ్మలు, హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గారు మాట్లాడుతూ.. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశామని, ఆరేళ్లక్రితం ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు చేసి తెలంగాణ ఇప్పుడు అభివృద్ధిలో దూసుకెళ్తోందని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి‌ పాలనలో హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉందన్నారు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాతే నగరంలో శాంతిభద్రతలు పటిష్టమయ్యాయని అన్నారు. అందరి హైదరాబాద్‌ను కొందరి హైదరాబాద్‌కు మార్చేందుకు కుట్ర పన్నుతున్నవారికి ఓటుతో బుద్ధి చెప్పాల్సిందిగా ప్రజలను కోరారు. ఓట్ల కోసం బీజేపీ నేతలు దిగజారుతూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, వరద బాధితులకు ప్రభుత్వం ఇస్తున్న రూ.10 వేలు ఓర్వలేక అడ్డుకున్నారని, ఎవరో ఆపితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆగదని, ఎన్నికల అనంతరం వరద బాధితులందరికి న్యాయం చేస్తామని అన్నారు. ఎన్నికల వేళ ప్రజల ముందుకు వస్తున్న బీజేపీ ప్రస్తుతం కేంద్రంలో పాలిస్తుందని, మరి ఆరేండ్లలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఒక్కపనైనా చేసిందా అని ప్రశ్నించారు. పచ్చగా ఉన్న హైదరాబాద్‌లో బీజేపీ నిప్పు పెట్టే ప్రయత్నం చేస్తోందని, ప్రశాంతంగా ఉన్న హైదారాబాద్‌లో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తోందని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వేల కోట్లతో గల్లి గల్లీలో టిఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యపడిందని, రాబోయే రోజుల్లో కూడా మరెన్నో కార్యక్రమాలు టీఆర్ఎస్ తోనే జరుగుతాయన్నారు. అలాగే నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఉన్న భూ సమస్యలన్నింటికీ సీఎం కేసీఆర్ గారు ప్రవేశ పెట్టిన కొత్త రెవెన్యూ చట్టంతో త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపి యజమానికి పూర్తి హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఆలోచనతో డిసెంబర్ 1న జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన 8 మంది అభ్యర్థుల గెలుపుకు మద్దతు పలికి కారు గుర్తుపై ఓటు వేసి తిరిగి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి గారు, వేముల ప్రశాంత్ రెడ్డి గారు, మేయర్ బొంతు రామ్మోహన్ గారు, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, ఎమ్మెల్యేలు బాజి రెడ్డి గోవర్ధన్ గారు, కేపి వివేకానంద్ గారు, జీవన్ రెడ్డి గారు, హనుమంత్ షిండే గారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ గారు తదితరులు పాల్గొన్నారు.