గ్రేటర్ లో మరొకసారి తెరాస కి పట్టం కట్టండి:సీఎం కే.సీ.ఆర్

హైదరాబాద్‌,తీస్మార్ న్యూస్: రానున్న కొన్ని నెలల్లో హైదరాబాద్ నగరానికి 24 గంటలు నీళ్ళు సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు.హైదరాబాద్‌ మహ నగరంలో గతంలో ఎన్నడ్డు లేని విధంగా అభివృద్ధి ఇప్పుడు జరుగుతోందని..మరోసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిపించండి అని ప్రజలను కేసీఆర్‌ కోరారు.

‘నగర ప్రజలు, పేదలకు కేసీఆర్‌ అందించిన కానుక ఉచిత తాగునీరు. అపార్ట్‌మెంట్లలో ఉన్న ప్రతి కుటుంబానికి 20వుల లీటర్ల ఉచిత మంచినీరు పథకం అమలు చేస్తాం. ఐదేళ్లలో మిషన్‌ భగీరథ పూర్తి చేశాం. మేం ఇస్తున్న రైతుబంధు ఏ రాష్ట్రంలోనైనా ఉందా? ప్రతీ రైతు కుటుంబానికి రూ.5లక్షల రైతుబీమా అమలు చేస్తున్నాం. యావత్‌ నగర ప్రజల కోసం 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం. కులమతాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నాం. కల్యాణలక్ష్మీ, కంటి వెలుగు పథకాలు ఎక్కడా లేవు. కేసీఆర్‌ కిట్‌ అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్నాం. కేసీఆర్‌ కిట్టు..సూపర్‌ హిట్టు’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

‘దోబీఘాట్లు, సెలూన్లకు ఉచిత విద్యుత్‌ ఇస్తాం. దేశంలో ఎక్కడాలేని విధంగా వెయ్యి గురుకుల పాఠశాలలు ప్రారంభించాం. కరోనాతో రాష్ట్రానికి రూ.52వేల కోట్ల ఆదాయం కోల్పోయినా ఎక్కడా సంక్షేమ పథకాలు ఆపలేదు. హైదరాబాద్‌ కోసం కేంద్రాన్ని అడిగినా పట్టించుకోలేదు. హైదరాబాద్‌ నగరం అశాస్త్రీయంగా పెరిగింది. సరైనా మౌలిక వసతులు లేకుండా కాలనీల నిర్మాణాలు జరిగాయి. వరదల నుంచి హైదరాబాద్‌ను కాపాడుకోవాలి. దీని కోసం ఏటా 10వేల కోట్లు కేటాయిస్తామని’ సీఎం చెప్పారు.