ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా పాజిటివ్

హైదరాబాద్,తీస్మార్ న్యూస్:రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా పాజిటివ్ గా తేలినట్టు మంత్రి ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ టీకా ట్రయల్స్ లో భాగంగా టీకాను వేయించుకున్నారు హర్యానా ఆరోగ్య శాఖా మంత్రి అనిల్ విజ్.వాస్త‌వానికి న‌వంబ‌ర్ 20వ తేదీన మంత్రి కోవాగ్జిన్ టీకాను తీసుకున్నారు. అంబాలా హాస్పిట‌ల్‌లో జ‌రిగిన మూడ‌వ ద‌శ ట్ర‌య‌ల్స్‌లో భాగంగా మంత్రి అనిల్ విజ్.. వాలంటీర్ రూపంలో వ్యాక్సిన్ తీసుకున్నారు. హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్‌బ‌యోటెక్ సంస్థ కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేస్తున్న విష‌యం తెలిసిందే.