గ్రేటర్‌ పోరు: ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

హైదరాబాద్: గ్రేటర్‌ హైదరాబాద్‌ మన్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నామినేషన్‌ గడువు ముగిసింది. మూడు రోజుల పాటు అధికారులు నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్ల చివరిరోజైన శుక్రవారం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ అత్యధికంగా 600కిపైగా నామినేషన్లు వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. చివరి రోజు కావడంతో నామినేషన్లు వేసిన అభ్యర్థులతో జోనల్‌ కమిషనర్ల కార్యాలయాలు కిటకిటలాడాయి.

నిన్నటి వరకు 537 మంది అభ్యర్థులు 597 నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం నామినేషన్ల సంఖ్య వెయ్యికి పైనే ఉంటుందని అధికారుల అంచనా వేస్తున్నారు. రేపు అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఉంటుంది. ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అధికారులు అవకాశం కల్పించారు.