ప్రజా శ్రేయ్యసుకై తపించిన ఏకైక పార్టీ టీ.ఆర్.ఎస్
  • ప్రజలకు మేలు చేసే ఏకైక సర్కార్ టీఆర్ఎస్..
  • చేయి చేయి కలిపి అభివృద్ధిలో భాగమవ్వండి..
  • హైదరాబాద్ అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యం..

కుత్బుల్లాపూర్ డివిజన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి, ఎమ్మెల్యేలు..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని గణేష్ నగర్ లో డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన కూన గౌరీష్ పారిజాత గారికి మద్దతు తెలుపుతూ ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ఈరోజు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు గారు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సికింద్రాబాద్ పార్లమెంట్ ఇంఛార్జి బండి రమేష్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌తో హైదరాబాద్‌ అభివృద్ధి ప్రయాణంలో ప్రజలు చేయి చేయి కలిపి ముందుకు రావాలని, హైదరాబాద్‌ మహానగర ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం, మౌలిక సదుపాయాల కల్పనలోనూ ఎక్కడా రాజీ లేకుండా ముందుకు సాగుతుందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ప్రకటించిన ప్రణాళికను వందకు వంద శాతం అమలు చేసిందని, చెప్పని అంశాలను కూడా ప్రజల సౌకర్యార్థం అందుబాటులో ఉంచి అమలు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ పార్టీకే దక్కుతుందని, తమ పార్టీకి తెలంగాణ ప్రజల పట్ల, హైదరాబాద్‌ అభివృద్దిపై ఉన్న నిబద్దతకు ఇది నిదర్శనమని అన్నారు. ఉచిత హామీలు ఇస్తున్న బిజెపి ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉందని సీఎం కేసీఆర్ గారు ప్రవేశ పెడుతున్న పథకాలు ఎందుకు అక్కడ అమలు చేయట్లేదని అడిగారు. ఎన్నికలు వస్తున్నందుకు ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా అంతా మేమే చేశామని చెప్పుకొస్తున్నారని, హైదరాబాద్ లో వారు చేసిన ఒక్క అభివృద్ధి పని చెప్పాలన్నారు. మన ప్రభుత్వం, మన పార్టీ, మన నాయకులను ఎన్నుకుంటేనే మన ప్రాంతం మరింత అభివృద్ధి అవుతుందన్నారు. అతి స్వల్ప కాలంలో తాము అమలు చేస్తున్న అభివృద్ధికి మద్దతు తెలిపి గతంలో ఇచ్చిన విజయం కన్నా ఇంకా ఉన్నతమైన విజయాన్ని టీఆర్ఎస్ అభ్యర్థులకు అందించి ప్రభుత్వాన్ని మరలా ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేఎం గౌరీష్, మాజీ కార్పొరేటర్ బొడ్డు వేంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.