బల్దియాలో కారు స్పీడు కొనసాగేనా?
  • గ్రేటర్ ఎన్నికల్లో అధికార తెరాస మళ్ళీ నిలదొక్కుకుంటుందా?
  • దుబ్బాక సీన్ రిపీట్ అవుతుందా?
    అందరి నోట ఇదే మాట మొత్తం 9101 పోలింగ్ స్టేషన్లలో  150 కార్పొరేటర్ స్థానాలకు గాను 1122 మంది అభ్యర్థులు పోటీలో వున్నారు, కొండాపూర్ లో 90 అత్యధిక పోలింగ్ బూతులు, రామచంద్ర పురం లో అత్యల్ప 33 పోలింగ్ బూతుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.  ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది.ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ప్రజలు అభివృద్ది వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది.సెటిలర్లు కూడా అభివృద్ది వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం అందింది.ఏది ఏమైనా అధికార తెరాస మాత్రం సెంచరీ కొడుతుందని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.సెంచరీ కొడుతుందా?లేదా? అని తెలియాలంటే డిసెంబర్ 4 వరకు ఆగాల్సిందే.