జిహెచ్ఎంసి ఎన్నికలలో భాగంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు మంగళవారం 137వ డివిజన్ వినాయక్ నగర్ లో రామగుండం ఎమ్మెల్యే చందర్ తో కలిసి విస్త్రత ప్రచారం చేశారు
ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ
👉రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అందని మనిషే లేడు
👉తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం
👉తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్ గొప్పగా అభివృద్ధి చెందింది, మరింత చెందుతోంది
👉ప్రజలకు సాగు, తాగునీరు, విద్యుత్ కష్టాలు లేకుండా చేసిన కెసిఆర్ గొప్ప పాలనాదక్షులు
👉అభివృద్ధి పనులు సాఫీగా సాగాలంటే మొదట శాంతి నెలకొని ఉండాలి
👉కెసిఆర్ సుపరిపాలనలో శాంతికి ఎలాంటి భంగం కల్గలేదు
👉తెలంగాణలో నివసిస్తున్న వివిధ మతాలు, కులాలు,ప్రాంతాలు, భాషలకు చెందిన వారంతా ప్రశాంతంగా జీవిస్తున్నారు.
👉 కెసిఆర్ పాలనాతీరు,శాంతి సామరస్యాలు నెలకొని ఉండడం, కెటిఆర్ పట్టుదలతో పెట్టుబడులు తరలివస్తున్నాయి
👉 విచ్ఛిన్నకర,విధ్వంసక చర్యలకు పాల్పడే బిజెపి హైదరాబాద్ నగరంలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నది
👉కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణకు గానీ, హైదరాబాద్ నగరాభివృద్ధి కానీ ఎటువంటి సాయం చేయడం లేదు
👉 వరదల్లో చిక్కుకున్న వారికి 10వేల రూపాయలు సాయం చేస్తుంటే, బిజెపి నాయకులకు కండ్లు మండి ఆపించారు
👉 విజ్ఞులైన హైదరాబాద్ ఓటర్లు కారు గుర్తుకు ఓటేసి టిఆర్ఎస్ ను గెలిపించి సంక్షేమం, అభివృద్ధి రెండు కండ్లు మాదిరిగా అంకితభావంతో ముందుకు సాగుతున్న కెసిఆర్ కు మరింత అండగా నిలబడతారని ఆకాంక్షిస్తున్న.
👉ప్రతిక్షణం అబద్ధాలు చెబుతూ నానా యాగీ చేస్తున్న బిజెపిని సోయిలో లేకుండా చేయాల్సిన గురుతర బాధ్యత మనందరిపై ఉంది.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ అభ్యర్థి బద్దం పుష్పలత పరుశరాంరెడ్డి, ఆమె భర్త, టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు పరుశురాం రెడ్డితో పాటు గులాబీ శ్రేణులు,ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు