బండి సంజయ్ కి బాధ్యత లేదు : దినేష్ చౌదరి

హైదరాబాద్,తీస్మార్ న్యూస్: బీ.జే.పీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బాధ్యాతారాహిత్యంగా మాట్లాడారని మండి పడ్దారు టీ.ఆర్.ఎస్ టెక్ సెల్ కన్వీనర్ దినేష్ చౌదరి.ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతుందని అనడానికి బండి సంజయ్ మాటలే నిదర్శనం అని, తాను ఇచ్చిన తప్పుడు సంకేతాల వల్ల పక్కదోవ పట్టి పాడవుతుందని మండిపడ్డారు.

మోటర్ వెహికల్ చట్టం గురించి అవగాహణ లేకుండా జీ.హెచ్.ఎం.సీ తో చలాన్లు కట్టిస్తా అని చెప్పిన బండి సంజయ్ ఇచ్చిన హామీలు

  • త్రిపుల్ రైడింగ్
  • డ్రంక్ & డ్రైవ్
  • ఓవర్ స్పీడ్
  • సిగ్నల్ జంపింగ్
  • రాంగ్ సైడ్ డ్రైవింగ్
    ఇలాంటి చట్టవిరుద్ధమైన పనులను ప్రోస్తహిస్తూ విద్వేషపూరితమైన ప్రచారాలు చేస్తూ యువతను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నావి బండి సంజయ్,యువత తప్పుదోవ పడితే ఈవ్ టీజింగ్లతో పాటు అత్యాచారాలు జరిగే ప్రమాదాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వెహికల్ చట్టాన్ని ఉల్లంఘించమని మీరే చెప్తున్నారు అంటే “కేంద్రం తీసుకొచ్చిన చట్టం తప్పా? దాన్ని ఉల్లంఘించిన కూడా సమర్ధిస్తా అంటున్న నీది తప్పా?” అనే విషయం ప్రజలకు తెలియాలని దినేష్ చౌదరి అన్నారు.మోటార్ వెహికల్ చట్టం 128/1 ప్రకారం ఒక్క వాహనంపై ఇద్దరికంటే ఎక్కువ ప్రయానిస్తే ఎటువంటి జరిమానాలు ఉన్నాయో తెలుసుకోండి,టూ వీలర్ పై నిర్ణీత వ్యక్తులకంటే ఎక్కువ మంది ప్రయాణిస్తే వాహనం అదుపు తప్పి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో పాటు ప్రాణాలు పోయే అవకాశం ఉందని అది కూడా బండి సంజయ్ కి తెలియదా అని హేళన చేశారు.ఓట్ల కోసం యువతను పక్కదోవ పట్టించే నీకు,నీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజు ఎక్కువ సమయం లేదని ఆయన మండి పడ్డారు.