బీజేపీ కి ఓటేస్తే హైదరాబాద్ లోని  అన్ని వర్గాల ప్రజలకూ నష్టమే

బీజేపీ పార్టీ అభివృద్ధి గురించి మాట్లాడదు

మత విద్వేషాలను మాత్రమే రెచ్చగొడుతుంది

హైదరాబాద్ లో గొడవలు చేస్తే
వచ్చే ఐటీ కంపెనీలు రావు

ఉన్న ఐటీ కంపెనీలు పోతయి , అందులో పని చేసే మన పిల్లల ఉద్యోగాలు పొతయి . వ్యాపారాలు పూర్తిగా దెబ్బ తింటయి. అందులో పని చేసే లక్షలాది మంది రోడ్డున పడతరు. వాళ్ళ కుటుంబాలు వీధిన పడతయి

అమెజాన్ కంపెనీ రూ 21,000 కోట్లు ఇటీవల హైదరాబాద్ లో పెట్టుబడి పెడతామని ప్రకటించింది. గూగుల్ , ఫేస్ బుక్ , సహా అనేక అంతర్జాతీయ ఐటీ కంపెనీలు హైదరాబాద్ కు వస్తున్నయి . హైదరాబాద్ ప్రజలు అందరినీ ఆదరించే వాళ్ళు కావడం , ఇక్కడి మంచి వాతావరణం , కేసీఆర్ ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడడం వల్ల ఐటీ కంపెనీలు హైదరాబాద్ కు వస్తున్నయి . దీన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓర్వలేకపోతున్నది . హైదరాబాద్ లో గొడవలు చేసి ఐటీ కంపెనీలను గుజరాత్ కు తీసుకుపోవాలని బీజేపీ కుట్ర చేస్తున్నది .

బీజేపీ పొరపాటున గెలిస్తే
రియల్ ఎస్టేట్ రంగం నాశనమై పోతుంది.

పైసా పైసా కూడబెట్టి కష్టపడి సంపాదించుకున్న ఇండ్లు , ఓపెన్ ప్లాట్ లు , అపార్ట్ మెంట్ ఫ్లాట్ ల ధరలు రూపాయి నుండి 10 పైసలకు పడిపోతయి

సినిమా ఇండస్ట్రీ పూర్తిగా దెబ్బ తింటుంది

రామోజీ ఫిలిం సిటీ లాంటివి సందర్శకులు లేక వెల వెల బోతయి .

పత్రికలు , టీవీ చానళ్ల కు యాడ్స్ పూర్తిగా తగ్గిపోయి జర్నలిస్టులు , ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడతరు

శాంతి భద్రతలకు రక్షణ ఉండదు

యూపీ , బీహార్ , గుజరాత్ లాగా నేరాలు పెరుగుతయి

బీజేపీ వాళ్ళు ప్రతి దానికి ఘర్షణ వైఖరితో ప్రవర్తిస్తుంటరు.

బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ , కర్ణాటక రాష్ట్రాల్లో గతంలో , ఇటీవల మతకల్లోలాల్లో చాలా మంది చనిపోయారు . కర్ఫ్యూ లు , 144 సెక్షన్ లు అక్కడ నిత్యకృత్యమయ్యాయి .

హైదరాబాద్ లో ఈ ఆరేండ్లలో ఒక్క ఘర్షణ జరగకుండా కేసీఆర్ ప్రభుత్వం శాంతి భద్రతలను పరిరక్షించింది

కేసీఆర్ ప్రభుత్వం సాగు నీటి ప్రాజెక్టులు సహా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది . తెలంగాణలో కనీసం ఇంకో పదేళ్లు టి ఆర్ ఎస్ పార్టీనే అధికారంలో ఉంటుంది. హైదరాబాద్ లో ఎక్కడో ఒకటి రెండు చోట్ల బీజేపీ కార్పొరేటర్లను గెలిపించడం వల్ల పైసా ఉపయోగం ఉండదు .

టి ఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది . ఒకరిద్దరు బీజేపీ కార్పొరేటర్లు గెలిచినా వాళ్ళు ప్రభుత్వాన్ని విమర్శించడానికి సమయాన్ని కేటాయిస్తారు . తమను ఎన్నుకున్న వార్డు లోని ప్రజల సమస్యలను పట్టించుకోరు . బీజేపీ వాళ్ళు చేసే మత ప్రచారాన్ని నమ్మి పొరపాటున ఓటేస్తే హైదరాబాద్ లోని అందరం నష్టపోతం .

కేసీఆర్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తున్నది. మనం ముఖ్యమంత్రిగా ఉన్నా అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించలేమనే సత్యాన్ని గమనించండి .

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టి ఆర్ ఎస్ భారీ మెజార్టీతో గెలిస్తే ఇతర పార్టీలు ఓవర్ యాక్షన్ చెయ్యలేవు.

మీకు బీజేపీ , కాంగ్రెస్ పార్టీల్లో ఏ నాయకుడి మీద నైనా ప్రేమ ఉంటే వాళ్లకు వారానికోసారి దావత్ ఇయ్యండి కానీ ఆ పార్టీ లకు ఓటేసి మనలను ఆదుకున్న హైదరాబాద్ కు నష్టం కలిగించకండి

అందుకే ఒకటికి పది సార్లు ఆలోచించి ఓటు వెయ్యండి

మీరు హైదరాబాద్ నగరం బాగుండాలనుకుంటే
ఈ పోస్ట్ ను మీ మిత్రులు , బంధువులకు షేర్ చేయండి

ఎందుకులే అని వదిలేస్తే మన పిల్లలు , వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు నష్టం కలుగుతుంది .