యువతా మేలుకో…

హైదరాబాద్,తీస్మార్ న్యూస్: గ్రేటర్ ఎన్నికల్లో ఇప్పటి వరకు 30 శాతం ఓట్లు పోలయ్యాయి.ఇప్పటి వరకు ఓట్లు వేసిన వారు  పెద్దలు,వృద్ధులు,దివ్యాంగులు,అంధులు వీరి ఓట్లే దాదాపుగా 25 శాతం ఉన్నట్టు తెలుస్తుంది.యువత ఇప్పటికైనా మేలుకొని మీ ఓటు హక్కును వినియోగించుకోవలసిందిగా విజ్ఞప్తి.కొందరు వృద్ధులని అడిగితే చెప్పిన విషయం “ఒక్కసారి ఓటు వేయకపోయినా చచ్చిన శవంతో సమానం” అని భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.ఇకనైనా మేలుకోండి ఓటు హక్కు వినియోగించుకోండి సమయం తిరిగిరాదు.