గ్రేటర్ ఎన్నికల్లో పూర్తిగా టి ఆర్ ఎస్ కు అనుకూలంగా మారిన వాతావరణం

సీఎం కేసీఆర్ బహిరంగ సభ , కేటీఆర్ ప్రచార సరళితో

పూర్తిగా ఆలోచనలో పడ్డ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు

హైదరాబాద్ ప్రశాంతత, అభివృద్ధి విషయంలో టి ఆర్ ఎస్ వాదనతో ఏకీభవిస్తున్న గ్రేటర్ లోని అన్ని వర్గాల ప్రజలు

బీజేపీ , కాంగ్రెస్ , ఎం ఐ ఎం కంటే టి ఆర్ ఎస్ పార్టీ చెబుతున్న దాంట్లో నిజముందని నమ్ముతున్న గ్రేటర్ ప్రజలు

టి ఆర్ ఎస్ కు గతంలో కంటే మెజార్టీ పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్న రాజకీయ విశ్లేషకులు

హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలని కోరుకునే మధ్య తరగతి , సంపన్న వర్గాల ఆసక్తితో ఈ సారి ఓటింగ్ శాతం పెరగవచ్చని అంచనాలు

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టి ఆర్ ఎస్ పార్టీ అత్యంత వ్యూహాత్మకంగా నిజాలను నిష్కర్షగా వెల్లడిస్తూ ప్రజల్లోకి వెళ్లడంతో చివరి రెండు మూడు రోజుల్లో పూర్తిగా ఆ పార్టీకి అనుకూలంగా పరిస్థితి మారిపోయిందని పలు సర్వే సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. రోడ్ షో లు , మీడియా ఇంటర్వ్యూ ల్లో టి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , ఐటీ ,మున్సిపల్ , పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ హైదరాబాద్ అభివృద్ధి విషయంలో నిర్మొహమాటంగా మాట్లాడిన విధానం నగర ప్రజలను పూర్తిగా కన్విన్స్ చేసే విధంగా కొనసాగిందని ప్రముఖ సర్వే సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఒకరు పేర్కొనడం గమనించాల్సిన అంశం. తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించక ముందు వరకు కొంత అయోమయ పరిస్థితి ఉన్న మాట వాస్తవమని , అయితే ఉచిత మంచినీటి సరఫరా సహా అనేక అంశాలను ప్రస్తావిస్తూ ప్రశాంత నగరమా ? విద్వేష నగరమా ? అని ఏది కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పడంతో ఆ మెసేజ్ ప్రజల్లోకి బాగా వెళ్లిందని ఆ సర్వే సంస్థ విశ్లేషించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విద్వేషపూరిత ప్రకటనలు , ఎం ఐ ఎం నేత అక్బరుద్దీన్ ప్రకటనలు … హైదరాబాద్ ప్రశాంతతకు భంగం కలిగించే కుట్రలు జరుగుతున్నాయని టి ఆర్ ఎస్ పార్టీ చెబుతున్న మాటలు నిజమని ప్రజలు నమ్మే వాతావరణం కల్పించాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మంత్రి కేటీఆర్ ఈ ఆరేండ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి , భవిష్యత్తు ప్రణాళిక , బీజేపీ వస్తే జరగబోయే ప్రమాదం గురించి హైదరాబాద్ ప్రజలకు వివరించడంలో సక్సెస్ అయ్యారని ఒక సీనియర్ జర్నలిస్ట్ పేర్కొనడం గమనార్హం . ఇటీవలే బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో మత కల్లోలాలు చెలరేగడం , కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరిధిలో శాంతి భద్రతలు ఉన్న ఢిల్లీలోనూ మత కల్లోలాలు చెలరేగి సుమారు 50 మంది ప్రాణాలు కోల్పోవడాన్ని జనాలు ఇంకా మర్చిపోలేదు . దీంతో బీజేపీ పొరపాటున గ్రేటర్ ఎన్నికల్లో కొన్ని స్థానాలు గెలిచినా మత విద్వేషాలను సృష్టిస్తుందనే భయం హైదరాబాద్ నగర ప్రజల్లో ఏర్పడింది. పైగా బీజేపీ , ఎం ఐ ఎం పార్టీల విద్వేషపూరిత ప్రకటనలు జనాల్లో అసహ్యాన్ని కలిగించాయి. దీంతో ప్రజలు ఈ ఆరేండ్లలో జరిగిన అభివృద్ధి , 24 గంటల విద్యుత్తు , శాంతి భద్రతలు , ఐటీ కంపెనీల పెట్టుబడులు , ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం నిర్మించిన ఫ్లై ఓవర్లు , అండర్ పాస్ లు ఇలా చాలా అంశాలను బేరీజు వేసుకున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టి ఆర్ ఎస్ భారీ మెజార్టీతో గతంలో మాదిరిగా విజయం సాధిస్తేనే హైదరాబాద్ అబ్జివృద్ధి ఇలాగే కొనసాగుతుందనే భావన ప్రజల్లో ఏర్పడింది . పైగా మతం పేరుతో విద్వేషాన్ని రెచ్చ గొట్టే బీజేపీ , ఎం ఐ ఎం వంటి పార్టీలపై ఈ ఎన్నికల్లో నెగెటివ్ అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది . టి ఆర్ ఎస్ హుందాగా ప్రచారం కొనసాగించిన తీరు , ఇతర పార్టీలు వ్యవహరించిన తీరు ప్రజలను టి ఆర్ ఎస్ కు ఇంకా దగ్గర చేశాయని మరో సర్వే సంస్థ అధినేత పేర్కొనడం గమనార్హం .