జనవరిలో మోగనున్న నగరపాలక ఎన్నికల నగారా…

2021 జనవరి నెలాఖరులో మహనగరపాలకమండలి ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది.గ్రేటర్ కార్పోరేషన్ ఎన్నికలు జనవరి నెలాఖరులో లేదా ఫిబ్రవరి మొదటివారంలో నిర్వహించాలనే యోచనలో ఉంది.ఈ మేరకు తాజా ప్రతిపాదికను రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకు తీసుకెళ్లేందుకు నిర్ణయించుకున్నట్తు తెలుస్తుంది. ఇప్పటికే అధికారులు ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు, ఇప్పటికే ఓటర్ల తుది జాబితా షెడ్యూల్ కూడా విడుదల చేశారు.ఓటర్ల జాబితా విడుదల చేసిన తరువాత ఎప్పుడైనా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.