చెన్నై: భారత మాజీ క్రికెటర్, తమిళనాడు వాసి లక్ష్మణ్ శివరామక్రిష్ణన్ భారతీయ జనతాపార్టీలో (బీజేపీ) చేరారు. తమిళనాడు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సీటీ రవి.. లక్ష్మణ్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ ప్రాథమిక సభ్యత్వ కార్డును అందజేశారు. లక్ష్మణ్ శివరామక్రిష్ణన్ 1965, డిసెంబర్ 31న చెన్నైలో జన్మించారు. విద్యాభ్యాసం తర్వాత క్రికెట్‌లో రాణించి తమిళనాడు రంజీజట్టులో ప్రవేశించారు. అనంతరం రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్‌గా భారత క్రికెట్ జట్టులోనూ చోటు సంపాదించారు. అనంతరం కామెంటేటర్‌గా, ఫీల్డ్ అంపైర్‌గా క్రికెట్ క్రీడకు తన సేవలు అందించారు.
