తెలంగాణలో నువ్వా-నేనా అన్నట్టుగా సాగిన దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి.దుబ్బాక ఎన్నికల ఫలితాలను 10వ తారీఖు ఉదయం నుండి ఎప్పటికప్పుడు లైవ్ అప్ డేట్స్ అందిస్తుంది మీ తీస్మార్ న్యూస్…
దుబ్బాక పోరులో 23 మంది పోటిపడ్డారు, ప్రధానంగా అధికార పార్టీ టీ.ఆర్.ఎస్ నుండి దివంగత రామలింగారెడ్డి గారి భార్య సుజాత, కాంగ్రెస్ నుండి శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నుండి రఘునందన్ రావు బరిలో ఉన్నారు.హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు గెలుపు మాదంటే-మాదంటూ ధీమాగా ఉన్నారు. దుబ్బాకలో 82.16 శాతం ఓట్లు పోలయ్యాయి, ఒక సంస్థ చేసిన సర్వేలో అధికార పార్టీ మళ్ళీ పగ్గాలు చేపడుతుందని సర్వే సంస్థకి సంబందించిన సభ్యుడు(పేరు తెలపడానికి ఇష్టపడలేదు) తెలిపారు. ప్రజాతీర్పు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనుకుంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
*మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ తీస్మార్ న్యూస్”