కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మృతి

కరోనా బారిన పడి నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భారత్‌ భాల్కే మరణించారు. పుణేలోని రబీ ఆస్పత్రిలో శుక్రవారం నుంచి వెంటిలేటర్‌ మీద చికిత్స పొందుతున్న ఆయన శనివారం పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు.

మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్‌ తోపే ‘పందర్‌పూర్‌- మంగళ్వేదా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బల్కే మరణం ఆ నియోజక వర్గ ప్రజలకు తీరని లోటని, అంకిత భావాలున్న నాయకుడు భాల్కే అని, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టుగా’ ట్వీట్‌ చేశారు.