మోదీకి కేసీఆర్‌ లేఖ

నూతన పార్లమెంటు శంకుస్థాపనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలుపుతు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేఖ రాశారు. నూతన పార్లమెంట్‌ నిర్మాణానికి గురువారం ఢిల్లీలో శంకుస్థాపన జరగనుంది.

ఈ సందర్భంగా కేసీఆర్‌ సెంట్రల్‌ విస్టా ప్రాజెక్ట్‌ జాతి ఆత్మ గౌరవానికి ప్రతీక పేర్కొన్నారు. ప్రజలందరికీ గర్వకారణమైన ఈ పార్లమెంటు నిర్మాణం ఎప్పుడో జరగాల్సి ఉందని, ప్రస్తుతం వినియోగంలో ఉన్న సదుపాయాలు విదేశీయుల చరిత్రతో ముడిపడి ఉన్నాయని కేసీఆర్‌ లేఖలో పేర్కొన్నారు.