కరోనా నష్టంపై ముఖ్యమంత్రి ఉన్నతస్త్యాయి సమీక్ష సమావేశం…
కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు శనివారం మధ్యాహ్నం 2గంటల నుండి ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహిస్తారు. 2020 – 2021 బడ్జెట్ పై మధ్యంతర సమీక్ష జరుపుతారు. కరోనా ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై, సవరించుకోవాల్సిన అంశాలపై కూలంకషంగా చర్చ జరుపుతారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థిక శాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొంటారు. శనివారం నాడు జరిగే సమీక్షలో వచ్చే అంచనాలపై ఆదివారం మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది.
Chief Minister Sri K. Chandrashekar Rao will conduct a review meeting at Pragathi Bhavan here on Saturday at 2 PM on the financial losses incurred by the state on account of the Corona pandemic. He will also conduct a mid-term review of the 2020-2021 State’s Annual Budget. He will discuss at length on the measures to be taken in the backdrop of the Corona pandemic, issues to be revised and other related matters of the Budget. Chief Secretary Sri Somesh Kumar, Principal Secretary (Finance) Sri Ramakrishna Rao, State Planning Board Vice Chairman Sri Vinod Kumar, senior officials From the finance department will participate in the review meeting. On the estimates arrived at the Saturday meeting, the CM may have meeting with the Ministers and secretaries of all the departments on Sunday on the matter.