ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై  బొత్స సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి జగన్ తనదైన శైలిలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుని దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఆయన తొంబై శాతం హామీలను కూడా నెరవేర్చి మొనగాడు అనిపించుకున్నారు.తన మంత్రులను సైతం పరుగులు పెట్టిస్తూ ఏపీలో పాలనను గాడిన పెట్టారు. ఈ నేపధ్యంలో దేశం మొత్తం చూసేలా ఏకంగా 30 లక్షలకు పైగా ఇళ్ళ పట్టాలను పేదలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని జగన్ తాజాగా ప్రారంభించారు.దీని మీద వైసీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మూడు దశాబ్దాలుగా ఇంతటి పెద్ద కార్యక్రమం ఎక్కడా జరగ‌లేదని ఆయన అన్నారు. తన పొలిటికల్ కెరీర్ లో జగన్ లాంటి సీఎంని చూడలేదని కూడా చెప్పారు. జగన్ అనుకుంటే తప్పక  చేస్తారు, ఆయన పేదల సీఎం అంటూ బొత్స  కితాబు ఇచ్చారు.రాష్ట్రంలో ఏ ఒక్క పేద వాడూ ఇల్లు లేకుండా ఉండరాదు అన్నది జగన్ విధానమని కూడా బొత్స అన్నారు. గజం అయిదు నుంచి పదివేల విలువ చేసే ఈ రోజుల్లో జగన్ ఉచితంగా విలువైన భూమి ఇవ్వడమే కాకుండా ప్రభుత్వమే ఇల్లు కట్టించే ఏర్పాట్లు చేశారని బొత్స చెప్పుకొచ్చారు. ఇది నిజంగా గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ నెల 30న ముఖ్యమంత్రి జగన్ విజయనగరం జిల్లాలో మలి విడత ఇళ్ళ పట్టాల పంపిణీకి వస్తున్న నేపధ్యంలో ఉత్తరాంధ్రా సీఎం కోసం భారీ స్వాగతానికి రెడీ అవుతోంది.