జగన్ అంటే అందుకే గౌరవం:తమ్మినేని

స్పీకర్ తమ్మినేని విద్యాధికుడు, రాజకీయ అనుభవశాలి. ఎన్టీయార్ నుంచి అనేక మంది ముఖ్యమంత్రులను చూసిన నాయకుడు. తాను స్వయంగా పలు మార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన నేత.ప్రస్తుతం తమ్మినేని స్పీకర్ పదవిలో ఉన్నారు. రాజకీయంగా ఎపుడూ తనదైన శైలిలో స్పందించే తమ్మినేని తాజాగా జగన్ గురించి అసక్తికరమైన కామెంట్స్ చేశారు.జగన్ ని తాను ముఖ్యమంత్రి గా కంటే గొప్ప మానవతావాదిగా గౌరవిస్తాను అని తమ్మినేని చెప్పడం విశేషం. జగన్ లో మానవతావాదం ఎక్కువని ఆయన అన్నారు. పేదల పట్ల రైతుల పట్ల ఆయన నిబద్ధత ఎన్నతగినది అని కితాబు ఇచ్చారు.నీవర్ తుఫాన్ బాధితులకు నెల రోజుల వ్యవధిలోనే నష్టపరిహారం ఇవ్వడం ద్వారా జగన్ గ్రేట్ అనిపించుకున్నారని తమ్మినేని ప్రశంసించారు. రైతాంగం ఇబ్బంది పడకూడదు అన్నదే జగన్ ఆలోచనగా చెప్పారు.ఏది ఏమైనా స్పందించే గుణం ఉన్న ముఖ్యమంత్రిగా జగన్ ఏపీకి ఉండడం ప్రజల అదృష్టమని కూడా ఆయన అంటున్నారు.