ఆర్ఆర్ఆర్ లో జూనియర్ కి జోడీగా ఛాన్స్ కొట్టేసిన తెలుగు హీరోయిన్?

ఆర్ఆర్ఆర్ లో జూనియర్ కి జోడీగా ఛాన్స్ కొట్టేసిన తెలుగు హీరోయిన్?

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ లో నందమూరి తారక రామారావు కి జోడీగా ఐశ్వర్య రాజేష్ కి నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. తారక్ కి జోడీగా హాలీవుడ్ నటి ఓలీవియా మోరీస్ నటిస్తున్న సంగతి తెలిసిందే.భీం ని ప్రేమించే గిరిజన యువతి పాత్రలో ఐశ్వర్యని తీసుకుంటున్నట్తు తెలుస్తుంది,చిత్ర బృందం నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు.  

తెలంగాణ అగ్ర రచయిత దాశరథి కృష్ణమాచార్య గారి వర్ధంతి

తెలంగాణ అగ్ర రచయిత దాశరథి కృష్ణమాచార్య గారి వర్ధంతి

దాశరథి కృష్ణమాచార్య (22.07.1925 -05.11.1987) తల్లిదండ్రులు: వేంకటమ్మ,వేంకటరంగాచార్యులు. స్వస్థలం: ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా చినగూడూరు గ్రామం. తెలంగాణలో జన్మించిన , గణనీయ వైతాళికులలో, మహాకవి దాశరథి అగ్రేసరులు.“ప్రాణము లొడ్డి ఘోరగహనాటవులన్ బడగొట్టి, మంచి మాగాణములన్ సృజించి, ఎముకల్ నుసిచేసి, పొలాలు దున్ని, భోషాణములన్ నవాబుకు స్వర్ణము నిండిన రైతుదే తెలంగాణము రైతుదే; ముసలి నక్కకు రాజరికంబు దక్కునే” – అంటూ గర్జించి, హైదరాబాద్ సంస్థాన విముక్తి మహెూద్యమంలో దూకి, నిజాం నవాబు అలీఖాన్ ను ఎదిరించి, తెలంగాణ విముక్తికై కారాగార శిక్ష అనుభవించి, లక్ష్యాన్ని సాధించిన స్వాతంత్రోద్యమ కవి సింహం దాశరథి. దాశరథి పూర్తి పేరు – దాశరథి కృష్ణమాచారి. దాశరథి 1925 జూలై 22 నాడు, ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా, చినగూడూరు గ్రామంలో జన్మించినాడు. శ్రీమతి వేంకటమ్మ, శ్రీమాన్ వేంకటాచార్యులు ఆతని తల్లిదండ్రులు. దాశరథి రంగాచారి దాశరథి తమ్ముడు. తండ్రి నుండి, చిన్ననాడే సంస్కృత భాషా సాహిత్యాలను, తల్లి నుండి...

హామీలన్నీ పూర్తి చేస్తున్నాం..  రంగారెడ్డి నగర్ డివిజన్ లో రూ.1.80 కోట్ల అభివృద్ధి పనుల శంఖుస్థాపనలో ఎమ్మెల్యే..

హామీలన్నీ పూర్తి చేస్తున్నాం.. రంగారెడ్డి నగర్ డివిజన్ లో రూ.1.80 కోట్ల అభివృద్ధి పనుల శంఖుస్థాపనలో ఎమ్మెల్యే..

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి సహకారంతో కోట్ల నిధులు వెచ్చించి కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 127 రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని గురుమూర్తి నగర్, ఇందిర గాంధీ నగర్, రంగారెడ్డి నగర్, పంచశీల కాలనీ లలో రూ.1.80 కోట్లతో నూతనంగా చేపడుతున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ గారితో కలిసి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. నిధులకు కొరత లేకుండా ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని, కోట్ల నిధులను వెచ్చిస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ప్రణాళికబద్ధంగా సమస్యలను అధిగమిస్తూ ప్రగతి బాటలో నడుస్తున్నామన్నారు. మంచి...

జనవరిలో గ్రేటర్ ఎన్నికలు, GHMC తెరాస నేతల  మనోభావాల పై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం

జనవరిలో గ్రేటర్ ఎన్నికలు, GHMC తెరాస నేతల మనోభావాల పై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం

వరద సహాయ పనుల్లో అవకతవకలకు గానూ వరదబాధితుల ఆగ్రహావేశాలను చవిచూస్తున్న తెరాస పార్టీ నాయకత్వం, కార్యకర్తలు ఇప్పట్లో గ్రేటర్ ఎన్నికల జోలికి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ముందస్తు ఎన్నికలు జరపాలనే అంశంపై టీఆర్‌ఎస్‌ పునరాలోచనలో పడింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇటీవల సంభవించిన వరద నష్టం నుంచి నగరవాసులు పూర్తిగా కోలుకోకముందే ఎన్నికలకు వెళ్తే నష్టం జరుగుతుందనే భావన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు వరద సహాయక చర్యల్లో తలమునకలై ఉన్న అధికార యంత్రాంగం కూడా స్వల్ప వ్యవధిలో ఎన్నికల సన్నాహాలు చేయలేమనే నిస్సహాయత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పరిస్థితి కుదుటపడిన తర్వాతే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించాలనే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ తీసుకెళ్లినట్లు సమాచారం. కనీసం 45 రోజుల తర్వాతే ఎన్నికల షెడ్యూలు విడుదల చేయాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనకు సీఎం అంగీకరిస్తే...

అధ్యక్ష పీఠానికి ట్రంప్‌ దాదాపు దూరం!

అధ్యక్ష పీఠానికి ట్రంప్‌ దాదాపు దూరం!

అమెరికా అగ్రరాజ్యం అధ్యక్షపీఠాన్ని అధిరోహించడానికి డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ 6 ఎలక్టోరల్‌ ఓట్ల దూరంలో నిలిచారు. కాలిఫోర్నియా వంటి అతిపెద్ద రాష్ట్రంతోపాటు 72 ఏళ్లకు పైగా డెమొక్రాట్‌లకు అవకాశం ఇవ్వని ఆరిజోనాతో కూడా బైడెన్‌ జై కొట్టించుకున్నారు. అమెరికా అధ్యక్ష స్థానానికి 270 ఎలక్టోరల్‌ ఓట్లు అవసరం కాగా, 264 ఓట్లు సాధించిన బైడెన్‌తోపాటు ఆయన ఆధిక్యంలో ఉన్న నెవేడా ఫలితాలపై ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కీలక స్వింగ్‌ స్టేట్స్‌లో ఆధిక్యం కనబరిచిన ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ చివరిలో నిర్ణయాత్మక రాష్ట్రాల్లో ఓటమి చవిచూసి రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించే అవకాశానికి దాదాపు దూరమయ్యారు. మిషిగన్‌, పెన్సిల్వేనియా రాష్ట్రాల కౌంటింగ్‌ ప్రక్రియపై అనుమానం వ్యక్తం చేసిన ట్రంప్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. మరోవైపు అమెరికా అధ్యక్ష పీఠాన్ని ఎవరు అధిరోహించబోతున్నారన్నది దాదాపుగా తేలిపోయింది.అగ్రరాజ్యం రాజకీయాల్లో కురువృద్ధుడైన డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ అధ్యక్ష హోదాలో శ్వేతసౌధంలో...

MLC నవీన్ రావ్ గారి చేతుల మీదుగా TEESMAAR NEWS website లాంచ్

MLC నవీన్ రావ్ గారి చేతుల మీదుగా TEESMAAR NEWS website లాంచ్

గత కొంతకాలంగా డిజిటల్ మీడియాలో సరికొత్తగా కంటెంటును అందిస్తూ, రూపొందించిన ప్రతీదాన్ని వైరల్గా మార్చగల్గుతున్న తీస్మార్ న్యూస్ ఈ రోజు www.TEESMAARNEWS.COM Website ను MLC నవీన్ రావ్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఇప్పటికే సోషల్ మిడియా ప్లాట్ ఫాముల్లో దూసుకుపోతున్న తీస్మార్ న్యూస్ ఇటు న్యూస్ విబాగంతో పాటు అటు ఎంటర్ట్నెంట్లో సైతం పాపులారిటీ సంపాదించుకుంది. MLC నవీన్ రావు గారు తీస్మార్ న్యూస్ మాతృ సంస్థ కాకతీయ ఇన్నొవేటివ్స్ అధినేతలైన మురారిశెట్టి లక్ష్మణ్ (బందూక్ లక్ష్మణ్), రమేష్ మాదాసులు లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు, అనంతరం వారి కార్యాలయంలో సిబ్బందితో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భవిష్యత్తులో మిడియాకు సంబందించిన అన్ని శాఖల్లో తీస్మార్ న్యూస్ విస్తరించేలా ప్రణాళికలు రూపొందించినట్టు తెలియజేశారు. www.TEESMAARNEWS.COM  

మోహిదీప‌ట్నం స్కైవాక్‌కు మంత్రి కేటీఆర్ ఆమోదం

మోహిదీప‌ట్నం స్కైవాక్‌కు మంత్రి కేటీఆర్ ఆమోదం

హైద‌రాబాద్ : తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌ను విశ్వ‌న‌గరంగా తీర్చిదిద్దేందుకు ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్న విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్‌ను అద్భుతంగా త‌యారు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే దుర్గం చెరువును సుంద‌రంగా తీర్చిదిద్దారు. అక్క‌డ నిర్మించిన కేబుల్ బ్రిడ్జి న‌గరానికి మ‌ణిహారంలా మారింది. ఇప్పుడు అలాంటి మ‌రో స్టీల్ వంతెన‌ను నిర్మించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంది. మెహిదీప‌ట్నం వ‌ద్ద పాదాచారుల కోసం స్కై వాక్‌ను నిర్మించేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ స్కై వాక్ నిర్మాణానికి రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఆమోదం తెలిపిన‌ట్లు పుర‌పాల‌క శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అర‌వింద్ కుమార్ ట్వీట్ చేశారు. త్వ‌ర‌లోనే ఈ నిర్మాణానికి టెండ‌ర్లను ఆహ్వానించ‌నున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అక్క‌డున్న బ‌స్ షెల్ట‌ర్స్ ను కూడా రీడిజైన్ చేయ‌నున్నారు. పాదాచారుల స్కైవాక్ 500 మీట‌ర్ల పొడ‌వున స్టీల్‌తో నిర్మించ‌నున్నారు. మొత్తం 16 లిఫ్ట్‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు....

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. అద్భుత కళాఖండాలు, అడుగడుగునా ఆధ్యాత్మిక వాతావరణం, కండ్లు చెదిరే కట్టడాలతో అద్భుత దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటోంది.

ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి  కార్యాలయం త్వరలో ప్రారంభం

ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం త్వరలో ప్రారంభం

ఇరవై యేండ్ల క్రితం ఒక్కడితో మొదలైన ఉద్యమ ప్రస్థానం ఇవ్వాళ ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణ ఆత్మ గౌరవ పతాకం ఎగరేసే దాకా వచ్చింది. మొక్కవోని పోరాట పటిమతో సబ్బండ వర్గాలను ఏకం చేసి, చివరకు ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమ నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి ఫలితంగా తెలంగాణ రాష్ట్ర సమితికి త్వరలోనే దేశ రాజధాని ఢిల్లీలో గొప్ప కార్యాలయం నిర్మాణం కానుంది. ఇది పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అందరికీ గర్వకారణం.