పెళ్ళైంది కానీ…..

ల‌క్నో :  పెళ్లంటే నూరేళ్ల పంట‌.. కానీ అత‌ని జీవితంలో పంట పండ‌లేదు.. ఎందుకంటే పెళ్ల‌యి ఐదు నెల‌లు కావొస్తున్నా.. తొలి రాత్రి జ‌ర‌గ‌లేదు. ఎందుకంటే వ‌ధువు తొలిరాత్రికి దూరంగా ఉండ‌ట‌మే. ఫ‌స్ట్ నైట్‌కు ఎందుకు దూరంగా ఉంటుంద‌ని వ‌రుడి కుటుంబ స‌భ్యులు ఆరా తీశారు. వ‌ధువు హిజ్రా అని తెలియ‌డంతో వ‌రుడి కుటుంబం షాక్‌కు గురైంది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌కు చెందిన ఓ ఇద్ద‌రు యువ‌తీయువ‌కుల‌కు గ‌తేడాది అక్టోబ‌ర్ 28న వివాహ‌మైంది. ఆ త‌ర్వాత నూత‌న వ‌ధూవ‌రుల‌కు తొలిరాత్రికి కుటుంబ స‌భ్యులు ఏర్పాట్లు చేశారు. కానీ ఆ రోజు రాత్రి వ‌రుడిని వ‌ధువు ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌లేదు. ఏదో కార‌ణం చెబుతూ.. త‌న భ‌ర్త‌కు ప్ర‌తి రోజు దూరంగా ఉంటోంది. ఈ క్ర‌మంలో ఆ యువ‌కుడు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతూ ఒత్తిడికి లోన‌వుతున్నాడు. వ‌ధువుకు ఏమైనా స‌మ‌స్య‌లు ఉన్నాయా? అని వైద్యుడి ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్ల‌గా.. అత‌ను ప‌రీక్షించి ఆమె హిజ్రా అని తేల్చేశాడు. దీంతో వ‌రుడి కుటుంబ స‌భ్యులు షాక్‌కు గుర‌య్యారు.

వ‌ధువు కుటుంబంపై వ‌రుడు ఫైర్‌

వ‌ధువు హిజ్రా అని తెలియ‌డంతో ఆమె త‌ల్లిదండ్రుల‌పై వ‌రుడి కుటుంబ స‌భ్యులు ఫైర్ అయ్యారు. అమ్మాయి హిజ్రా అని తెలిసిన‌ప్ప‌టికీ విష‌యాన్ని ఎందుకు దాచారని ప్ర‌శ్నించారు. దీనిపై అబ్బాయి కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.