న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో గతంలో ఎన్నడూ చూడని బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత కొన్ని రోజులుగా ప్రకటిస్తూ వస్తున్నారు. సోమవారం బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్‌లో సామాన్యుడికి నేరుగా లబ్ధి చేకూర్చే అంశాలు పెద్దగా ఏవీ లేవనే చెప్పాలి. కొత్తగా అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్‌ను విధించారు. ఈ సెస్ వల్ల కొన్ని ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. ఈ బడ్జెట్ తర్వాత ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయి? వేటి ధరలు తగ్గుతాయో ఓసారి చూద్దాం.
ధరలు పెరిగేవి:
ఎలక్ట్రానిక్ వస్తువులు
మొబైల్
చార్జర్
లెదర్ షూ
పప్పు దినుసులు
ఆటోమొబైల్ విడి భాగాలు
రత్నాలు
సోలార్ ఇన్వర్టర్లు
ముడి పామాయిల్
సోయాబీన్
సన్‌ఫ్లవర్ ఆయిల్
యాపిల్స్
ధరలు తగ్గేవి:
ఐరన్
స్టీల్
నైలాన్ బట్టలు
కాపర్ వస్తువులు
ఇన్సూరెన్స్
విద్యుత్తు
డ్రై క్లీనింగ్
వ్యవసాయ పరికరాలు