కరోనా బారిన పడ్డ సన్నీ డియోల్‌

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు, గురుదాస్‌పూర్‌ బీజేపీ ఎంపీ సన్నీ డియోల్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని హిమాచల్‌ ప్రదేశ్‌ ఆరోగ్య కార్యదర్శి అమితాబ్ అవస్థీ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన మనాలీలోనే చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా గత రెండు, మూడు రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా టెస్ట్‌ చేయించుకోవాలని కోరుతూ సన్నీడియోల్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు.

64 ఏళ్ల సన్నీడియోల్ ముంబైలో భుజానికి శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకునేందుకు కుల్లూ జిల్లాలోని మనాలీ సమీపంలోని ఫాం హౌస్‌లోనే ఉంటున్నారు. ఈ నేపధ్యంలో తన స్నేహితులతో కలిసి తిరిగి ముంబై వెళ్లాలనుకున్నారని, ఈ క్రమంలో చేసిన పరీక్షలో సన్నాడియోల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గతేడాది పంజాబ్‌ గురుదాస్‌పూర్‌ నుంచి ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా తొలిసారి పోటీచేసిన సన్నిడియోల్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే సన్నీడియోల్ తండ్రి ధర్మేంద్ర గతంలో బీజేపీ ఎంపీగా పనిచేశారు.