రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం..

కరోనా నిబంధనల మధ్య రాష్ట్రంలో శుక్రవారం నుంచి పాఠశాలలు తిరిగి తెరవనున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌ నుంచి తొమ్మిది నెలలుగా పాఠశాలలు మూతపడ్డాయి. పలు పాఠశాలల్లో సామాజిక దూరం, ఇతర కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మాస్క్‌లు ధరించేలా చూడడంతో పాటు శానిటైజర్లు అందుబాటులో ఉంచామని, విద్యార్థుల మధ్య కనీస దూరం ఉండేలా సీటింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, విద్యార్థులు ఇండ్ల నుంచే ఆహారం, నీరు తీసుకువచ్చుకోవాలని, విద్యార్థులు గుమిగూడకుండా ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించారు. కోవిడ్ -19 మహమ్మారి మధ్య పాఠశాలల, కళాశాలలను తిరిగి ప్రారంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఒడిశా ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు తరచుగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఒడిశా ప్రధాన కార్యదర్శి సురేష్ చంద్ర మోహపాత్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖను కోరారు.