న్యూఢిల్లీ: పెట్రో ధరల మంట కొనసాగుతూనే ఉన్నది. చమురు కంపెనీలు వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వాహనదారుల జేబులు ఖాళీచేస్తున్నాయి. నిన్న లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచగా, తాజాగా మరో 27 పైసలు భారం మోపాయి. దీంతో పెట్రో ధరలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా జైపూర్‌లో ఉండగా, తర్వాతి స్థానంలో ఆర్థికరాజధాని ముంబై ఉన్నది.
తాజా పెంపుతో దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.86.30, డీజిల్ ధర రూ.76.48గా ఉండగా, జైపూర్‌లో పెట్రోల్ ధర రూ. 93.60, డీజిల్ రూ.85.67కి చేరాయి. ఇక దేశంలో మహానగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి..
కోల్‌కతా- పెట్రోల్ రూ.87.45, డీజిల్ రూ.79.83
ముంబై- పెట్రోల్ రూ.92.86, డీజిల్ రూ.83.30
చెన్నై- పెట్రోల్ రూ.88.60, డీజిల్ రూ.81.47
బెంగళూరు- పెట్రోల్ రూ.88.95, డీజిల్ రూ.80.84
హైదరాబాద్- పెట్రోల్ రూ.89.51 , డీజిల్ రూ.83.19
విజయవాడ- పెట్రోల్‌రూ.92.22, డీజిల్ రూ.83.30
కొత్త ఏడాది ఆరంభం నుంచి పెట్రో, డీజిల్ ధరలను చమురు కంపెనీలు క్రమం తప్పకుండా ధరలు పెంచుతూ వస్తున్నాయి. దీంతో జైపూర్‌లో చమురు ధరలు అత్యధికానికి చేరాయి. కాగా, చమురు ఉత్పత్తులపై ఒక్కో రాష్ట్రంలో ఒక్కోవిధమైన పన్నును ఆయా ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి.