మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

హైదరాబాద్‌ : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మంగళవారం మళ్లీ పెరిగాయి. చమురు కంపెనీలు పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై డీజిల్‌పై 38 పైసల వరకు పెంచాయి. తాజాగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 90.93, డీజిల్ ధర లీటర్‌కు రూ .81.32కు చేరింది. ఢిల్లీలో ఈ నెలలో ఇప్పటి వరకు పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.4.63, డీజిల్‌ లీటర్‌కు రూ.4.84 వరకు పెరిగింది. మరో వైపు ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ వంద వైపు పరుగులు పెడుతున్నది. ముంబైలో పెట్రోల్‌ లీటర్‌కు రూ.97.34కు చేరగా.. డీజిల్‌ రూ.88.44, చెన్నైలో పెట్రోల్‌ రూ.92.90, డీజిల్‌ రూ.86.31, కోల్‌కతాలో పెట్రోల్ లీటర్‌కు రూ.91.12, డీజిల్‌ రూ.84.20కు చేరింది. ఆదివారం ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ పెట్రోల్ డీజిల్‌పై వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) రూ.1 తగ్గించింది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ లీటర్‌ రూ.94.54, డీజిల్‌ రూ.88.69కు పెరిగింది. భోపాల్‌లో పెట్రోల్‌ రూ.98.96, డీజిల్‌ రూ.88.60, జైపూర్‌లో పెట్రోల్‌ రూ.97.47, డీజిల్‌ రూ.89.82కు చేరాయి. పలు నగరాల్లో పెట్రోల్‌ ధర రూ.వంద వైపు పరుగులు పెడుతున్నది. ఆది, సోమవారాల్లో కాస్త ఉపశమనం ఇచ్చిన చమురు కంపెనీలు మంగళవారం ధరలను పెంచాయి. ఇప్పటి వరకు ఈ నెలలో పెట్రోల్‌ ధరలు 15 సార్లు పెరిగాయి.