దేశ సైన్యానికి కేటీఆర్ సెల్యూట్‌

హైద‌రాబాద్ : ఆర్మీ డే సంద‌ర్భంగా భార‌త సైన్యానికి మంత్రి కేటీఆర్ సెల్యూట్ చేశారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. మ‌నం ప్ర‌కృతి వైప‌రీత్యాల‌లో ఉన్న‌ప్పుడు మ‌న‌ల్ని కాపాడుతారు. మ‌న దేశం యొక్క స్వేచ్ఛ కోసం సైనికులు ఎల‌ప్పుడూ ర‌క్ష‌ణ‌గా ఉంటారు. ఇండియ‌న్ ఆర్మీ ధైర్య సాహ‌సాల‌కు, త్యాగాల‌కు, వారి కుటుంబాల‌కు హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు.