భారీ వర్ష సూచన

న్యూఢిల్లీ : గత వారం రోజులుగా వాతావరణ మరీ చల్లబడింది. మావ్తా వర్షం ప్రభావం సాధారణ జీవితాల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. రాబోయే 48 గంటల్లో తుఫాను వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రాజధాని ఢిల్లీలో వర్షాకాలం కొనసాగుతున్నట్లుగా కనిపిస్తున్నది. అలాగే ఉత్తర భారతంలోని చాలా ప్రదేశాలు మంచుతో తడిసి ముద్దయ్యాయి. విపరీతంగా  కురుస్తున్న మంచు కారణంగా పలు ప్రాంతాల్లో జనజీవనం అస్థవ్యస్తం కాగా.. ప్రధాన రహదారులన్నీ మూతపడ్డాయి. దాంతో రాష్ట్రాల మధ్య నడిచే సరుకు రవాణా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. భారత వాతావరణ శాఖ నివేదికల ప్రకారం, ఆదివారం నుంచి పంజాబ్, హర్యానా, చండీ‌గఢ్‌, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తర రాజస్థాన్ వంటి మైదాన ప్రాంతాల్లో వర్షం పడుతున్నది. సోమవారం నుంచి పశ్చిమ హిమాలయ ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లడఖ్, గిల్గిత్-బాల్టిస్తాన్ అలాగే ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో వర్షం, మంచు కురుస్తుందని అంచనా. వర్షాల కారణంగా వాయవ్య భారతదేశంలోని మైదానాలపై ఉత్తర-వాయవ్య గాలులు వీస్తాయని, ఫలితంగా విపరీతంగా చలివీచే ప్రమాదం ఉన్నట్లుగా అంచనా వేశారు. మరో నాలుగు రోజుల తర్వాత హర్యానా, ఉత్తర రాజస్తాన్‌ మారుమూల ప్రదేశాల్లో విపరీతమైన చలి ఉండనున్నది. ఇదిలావుండగా, ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో ఇవాళ ఉదయం 8.30 గంటలకు కనిష్ట ఉష్ణోగ్రత 11.4 డిగ్రీల సెల్సియస్ నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది.స్కైమెట్ ప్రకారం, ఉత్తర భారతదేశంలోని మైదాన రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో రానున్న 2-3 రోజులు వర్షపు వాతావరణం ఉండనున్నది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ-ఎన్‌సీఆర్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, చండీ‌గఢ్‌లో భారీగా వర్షాలు, వడగళ్ళు కురిసే అవకాశం ఉన్నది.

వర్షం పడే ప్రాంతాలివే..

ఆఫ్ఘనిస్తాన్, దాని పరిసరాల్లో పాశ్చాత్య అవాంతరాల కారణంగా తుఫాను వాతావరణం ఏర్పడింది. రాబోయే 48 గంటల్లో ఇది పాకిస్తాన్ వైపు వెళ్లే అవకాశం ఉంది. పాశ్చాత్య భంగం ఫలితంగా, నైరుతి రాజస్థాన్‌లో అల్పపీడనం కనిపిస్తుంది. ఈ ప్రభావాల కారణంగా, పశ్చిమ హిమాలయాలలో జనవరి 4-6 మధ్య వర్షం లేదా హిమపాతం కురుస్తుందని అంచనా వేశారు. కోటా, అలీగఢ్‌, అంబాలా, బుండి, మీరట్, బరేలీ, హర్డోయి, నజీబాబాద్, సవాయి మాధోపూర్, అమృత్‌సర్, లూధియానా, పాటియాలా, సోనిపట్, పానిపట్, ఫరీదాబాద్, గురుగ్రామ్, భరత్పూర్, అల్వార్, చురుకు, ష్రాజు బులంద్‌షహర్, గౌతమ్ బుద్ధనగర్ తోపాటు అనేక ప్రాంతాల్లో వర్షాలు కురియవచ్చు.