మే 30 వరకు తెలంగాణ లాక్‌డౌన్

తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ ను మే 30 వరకు పొడగించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సారి రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకులకు లాక్‌డౌన్ నుంచి తెలంగాణ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఇప్పటి వరకు హైవేలపై ఉన్న బంకులు మాత్రమే తెరిచి ఉంచే అవకాశం ఉండేది.

వ్యవసాయ ధాన్యం తరలింపు వాహనాలు, ఎమర్జెన్సీ వాహనాలు లాక్‌డౌన్ సమయంలో పెట్రోల్, డీజిల్ కు ఇబ్బంది పడుతుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వం బంకులకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఇకపై రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు తెరుచుకోవచ్చు అని తెలిపింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.