కరోనా వైరస్ సోకి ఎమ్మెల్యే కేవీ విజయదాస్(61) మృతి చెందారు. విజయదాస్ కొంగడ్ నియోజకవర్గం నుంచి కేరళ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విజయదాస్ మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఎం నాయకులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు సంతాపం తెలిపారు. విజయదాస్ మృతి పార్టీకి తీరని లోటు అని సీఎం పేర్కొన్నారు. 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు పండాళం సుధాకరణ్‌పై విజయదాస్ 13 వేల మెజార్టీతో గెలుపొందారు. ఎమ్మెల్యేకు భార్య ప్రేమకుమారి, ఇద్దరు కుమారులు జయదీప్, సందీప్ ఉన్నారు.