కంగనా వివాదాస్పద ట్వీట్

ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమంపై దేశీయ, అంతర్జాతీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. పాప్ స్టార్ రిహన్నా, పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ తదితరులు రైతుల ఆందోళనలపై స్పందించారు. సచిన్‌, కోహ్లి సహా పలువురు క్రికెటర్లు రైతు ఉద్యమంపై సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తాజాగా రోహిత్ శర్మ సైతం రైతుల ఆందోళనపై ట్వీట్ చేశాడు.

‘మనమంతా కలిసికట్టుగా ఉన్నప్పుడు భారత్ బలంగా ఉంటుంది. రైతుల సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన తరుణం ఇది. దేశ ప్రగతిలో రైతులు కీలక భూమిక పోషిస్తున్నారు. కలిసికట్టుగా పరిష్కారం కనుగొనడంలో ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలను పోషిస్తారని ఆశిస్తున్నా. ఐక్య భారత్’ అని రోహిత్ శర్మ ట్వీట్ చేశారు. కాగా రోహిత్‌ శర్మ చేసిన ట్వీట్‌కు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ .

‘ఈ క్రికెటర్లందరూ దోబీ దగ్గర కుక్కల్లా ఎందుకు మొరుగుతున్నారు.అటు ఇంటికి కాకుండా.. ఇటు ఘాట్‌కు కాకుండా అంటూ’ కంగనా ట్వీట్ చేశారు. రైతు సంక్షేమం కోసం తీసుకొచ్చిన విప్లవాత్మక చట్టాలకు రైతులే ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు? అని’ ఆమె ప్రశ్నించారు. ఈ ఘర్షణలకు కారణమైన వారిని ఆమె మరోసారి ఉగ్రవాదులుగా అభివర్ణించారు. కంగనా వివాదాస్పద ట్వీట్ చేసిన కాసేపటికే ట్విట్టర్ ఆమె ట్వీట్‌ను తొలగించింది.