పశ్చిమ బెంగాల్‌లో భారీ పేలుడు

పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకున్నపేలుడు తీవ్ర విషాదాన్ని నింపింది. మాల్డా జిల్లాలో ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరిన రక్షక బృందాలు,అగ్నిమాపక బృందాలు, సహాయక చర్యల్ని పర‍్యవేక్షిస్తున్నాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ఉదయం 11 గంటల సమయంలో సుజాపూర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. పరిస్థితిని అదుపు చేసేందుకు భారీ పోలీసు బృందాలను పంపించామన్నారు. అగ్నిమాపక శకటాలు మంటలను అరికట్టడానికి ప్రయత్నిస్తున్నాయనీ, ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఆయన చెప్పారు.

మరోవైపు ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ .2 లక్షలు, గాయపడిన వారికి రూ .50 లక్షలు ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వ కార్యదర్శి అలపన్ బండి యోపాధ్యాయ ప్రకటించారు. పట్టణ అభివృద్ధి శాఖా మంత్రి సంఘటనా స్థలాన్ని సందర్శించనున్నారని తెలిపారు.