మీ ఆధార్‌ను ఎవ‌రైనా వాడారా.. తెలుసుకోండిలా

చాలా చోట్ల ఇప్పుడు ఆధార్ అవ‌స‌ర‌మైపోయింది. దీంతో అడిగిన ప్ర‌తి చోట మ‌న ఆధార్ వివ‌రాలు ఇవ్వాల్సి వ‌స్తుంది. న‌మ్మ‌క‌మైన చోట ఆధార్ వివ‌రాలు ఇస్తే ఫ‌ర్వాలేదు.. కానీ ఎవ‌రైనా మ‌న ఆధార్ డేటాను దుర్వినియోగం చేస్తేనే డేంజ‌ర్‌. అందుకే ఆ వివ‌రాలు స‌రైన చోట‌నే ఇచ్చామా? ఎవ‌రైనా మ‌న ఆధార్ డేటాను ఎవ‌రైనా దుర్వినియోగం చేశారా? అనే సందేహం చాలామందికే వ‌చ్చే ఉంటుంది. అందుకే మ‌న ఆధార్‌ను ఎక్క‌డ‌, ఎప్పుడు, ఎందుకు ఉప‌యోగించారో తెలుసుకునే స‌దుపాయాన్ని యూఐడీఏఐ అందిస్తోంది. గ‌త ఆరు నెల‌ల కాలంలో ఆధార్‌ను ఎందుకు ఉప‌యోగించారో యూఐడీఏఐ వెబ్‌సైట్ ద్వారా సులువుగా తెలుసుకోవ‌చ్చు..

– మ‌న ఆధార్ డేటా ఎక్క‌డ వాడారో తెలుసుకోవాలంటే ముందుగా మీ మొబైల్ నంబ‌ర్ ఆధార్ కార్డుతో అనుసంధానమై ఉండాలి. అప్పుడే ఆ వివ‌రాలు తెలుసుకోవ‌డం సాధ్య‌మ‌వుతుంది.

– ముందుగా మీ బ్రౌజ‌ర్‌లో యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ (https://uidai.gov.in/) ఓపెన్ చేయాలి

– యూఐడీఏఐ వెబ్‌సైట్ ఓపెన్ అయ్యాక ‘మై ఆధార్’ సెక్ష‌న్‌లోని ‘ఆధార్ స‌ర్వీసెస్’‌లో ఉన్న ‘Aadhaar Authentication History’పై క్లిక్ చేయాలి.

– అప్పుడు కొత్త పేజి ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ నంబ‌ర్‌ సెలెక్ట్ చేసుకోవాలి.

– ఆధార్ నంబ‌ర్ ఎంట‌ర్ చే|శాక‌ క్యాప్చా కోడ్‌ను ఎంట‌ర్ చేయాలి. ఆ త‌ర్వాత  Send OTPపై క్లిక్ చేయాలి.

– అప్పుడు కొత్త పేజి ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఏ లావాదేవీ చూడాల‌ని అనుకుంటున్నారు.. ఎంత వ్య‌వ‌ధిలోని లావాదేవీల వివ‌రాలు కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. అనంత‌రం మ‌న మొబైల్‌కి వ‌చ్చిన ఓటీపీని ఎంట‌ర్ చేసి.. వెరిఫై బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి.

– అప్పుడు కొత్త పేజీలో మ‌న ఆధార్‌ను ఏ స‌మ‌యంలో, ఎక్క‌డ ఉప‌యోగించారన్న వివ‌రాలు క‌నిపిస్తాయి. ఆ వివ‌రాల‌ను డౌన్‌లోడ్ చేసుకునే స‌దుపాయం కూడా ఉంటుంది.

– ఇలా ఎప్ప‌టిక‌ప్పుడు ఆధార్ వివ‌రాలు ఎక్క‌డ ఉప‌యోగించారో చూడ‌టం వ‌ల్ల త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌చ్చు.