ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్…నిబంధనలు పొడిగింపు

ఏప్రిల్ 30 వరకు కరోనా అన్ లాక్ డౌన్ నిబంధనలను కేంద్ర హోంశాఖ పొడిగించింది. మరోమారు కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచించింది.అన్ని రాష్ట్రాలు కరోనా నిబంధనలు, మార్గదర్శకాలు కఠినంగా అమలు చేయాలని.. ఆర్టీ పీసీఆర్ టెస్టుల సంఖ్య 70 శాతానికి పెంచాలని కేంద్రం జారీ చేసిన నిబంధనల్లో సూచించింది. పాజిటివ్ వచ్చిన వారికి సరైన చికిత్స అందించాలంది.ప్రజల రద్దీ ఉండే ఏరియాలు, పని చేసే ప్రాంతాల్లో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా ఆంక్షలు విధించవచ్చని పేర్కొంది.అంతరాష్ట్ర రవాణాపై ఎలాంటి ఆంక్షలు విధించరాదని కేంద్ర హోంశాఖ చెప్పింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను అన్ని రాష్ట్రాల మరింత వేగంగా చేపట్టాలంది. కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.