భారత్‌లో కరోనా విజృంభణ

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారత్‌లో నమోదైన మొత్తం కరోనా కేసులు 93లక్షలు దాటేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 43,082 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులునమోదు కాగా..492 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు భారత్‌లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 93,09,788కు చేరగా.. కోవిడ్‌ మరణాల సంఖ్య 1,35,715గా నమోదైంది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 4,55,555 యాక్టివ్ కేసులుండగా..ఇప్పటివరకు 87,18,517 మంది డిశ్చార్జ్ అయ్యారు.